నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి అంబటి, నిమ్మకాయ రాజనారాయణ
పట్టణంలోని ఆరో వార్డులో మెకానిక్ భాషా , గుంటూరు జానీల ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు పాల్గొన్నారు. ముందుగా మత పెద్దలతో కలిసి నమాజ్ లో పాల్గొన్నారు. ఉపవాసం ముగించిన వారికి ఖర్జూరాలను తినిపించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన భాషను అభినందించారు . మైనార్టీ సోదరులు గమనించి, ఆలోచించి మతతత్వ పార్టీలను ప్రోత్సహించ వద్దన్నారు. రాజకీయంగా సామాజికంగా మీకు అండగా ఉన్న వైఎస్సార్సీపిని గుర్తుంచుకోవాలన్నారు .
గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఇక్కడ అంబటిని, పార్లమెంట్లో అనిల్ కుమార్ ను గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు . కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు , స్థానిక నాయకులు , ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల బాధ్యులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.