Monday, December 2, 2024

మళ్లీ సొంతగూటికి చేరిన అమరావతి వైఎస్సార్సీపీ, కార్యకర్తలు కండువా వేసిఆహ్వానించిన  ఎమ్మెల్యే :నంబూరు శంకరరావు :

నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి

మళ్లీ సొంతగూటికి చేరిన అమరావతి వైఎస్సార్సీపీ, కార్యకర్తలు
ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు సమక్షంలో తిరిగి పార్టీలోకి

ఇటీవల టీడీపీలో చేరిన అమరావతి మండలం అమరావతి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి చేరారు. అమరావతిలోని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు  సమక్షంలో పార్టీలో చేరారు. అమరావతి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను టీడీపీ నేతలు మభ్యపెట్టి ఆ పార్టీలో చేర్చుకున్నారు. కానీ నిజం తెలుసుకొని ఇవాళ మళ్లీ పార్టీలోకి తిరిగివచ్చారు. అమరావతి కి చెందిన చొప్పరపు అర్జున్ రావు, ఉయ్యాల గోపికృష్ణ, మగల్ సుభాని,కాసిపోయిన గోపి, నామాల వెంకట పూర్ణచంద్ర, ఉయ్యాల శివ, గోకొన కొండలు, వల్లి బోయిన గణేష్, చొప్పరపు నరసింహారావు,గోకొన శీను  వైఎస్సార్సీపీలో చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ ప్రలోభాలకు లొంగిపోయి పార్టీ మారామని.. కానీ వెంటనే తప్పు తెలుసుకొని తిరిగి వైఎస్సార్సీపీలో చేరుతున్నామన్నారు. టీడీపీ నేతలు ప్రలోభాలను ఎవరూ నమ్మొద్దని కోరారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading