కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా గడ్డం ఇందు ప్రియా ఏక గ్రీవంగ ఎన్నిక..
కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ కైవసం
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏప్రిల్ 15,
కామారెడ్డి మునిసిపల్ చైర్ పర్సన్ గా గడ్డం ఇందు ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్.డి.ఓ. రఘునాథ్ రావు అధ్యక్షతన నూతన చైర్ పర్సన్ కొరకు జరిగిన మునిసిపల్ ప్రత్యేక సమావేశంలో 14వ వార్డుకు చెందిన ఇందు ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైందని ఆర్.డి.ఓ. ప్రకటించారు. కామారెడ్డి పట్టణంలో 49 మునిసిపల్ వార్డులు, ఒక ఎక్స్-అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యే తో కలిపి మొత్తం 50 మంది సభ్యులకు గాను కోరం కు 26 మంది సభ్యులు కావలసి ఉండగా 28 మంది కౌన్సిలర్లు హాజరయ్యారని ఆయన తెలిపారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుండి సీల్డ్ కవర్ లో ఇందు ప్రియ పేరు రాగా 48 వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ అన్వర్ అహ్మద్, 38 వ వార్డు కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్లు లు చైర్ పర్సన్ గా ఆమె పేరును ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమెదించారు. కాగా 28 మంది కౌన్సిలర్లలో ఎవరైనా తటస్థంగా ఉన్నారా అని మరోమారు చేతులెత్తవలసినదిగా కోరగా అందరు ఇందు ప్రియ పేరును ఆమోదిస్తూ చేతులెత్తారు. అనంతరం కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానిస్తూ సంతకాలు చేశారు. ఇందు ప్రియ మునిసిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్.డి.ఓ. ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇచ్చిన అనంతరం ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ సుజాత పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.