Thursday, December 12, 2024

పులివెందుల సభ లో ఏపీ సీఎం జగన్ తన చెల్లి షర్మిల చీరపై సెటైర్లు – జగన్ రెడ్డికి సంస్కారం ఉందా? అంటూ షర్మిల ఫైర్

నారద వర్తమాన సమాచారం

పులివెందుల సభ లో ఏపీ సీఎం జగన్ తన చెల్లి షర్మిల చీరపై సెటైర్లు – జగన్ రెడ్డికి సంస్కారం ఉందా  అంటూ షర్మిల ఫైర్

గుంటూరు జిల్లా

పులివెందుల‌లో స‌భ‌లో సీఎం జగన్ చేసిన కామెంట్లపై షర్మిల మండిపడింది .

వేలమంది సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టలు మీద ప్రస్తావన చేస్తారా

అసలు జగన్ రెడ్డికి సంస్కారం ఉందా

అంటూ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

అన్న చెల్లెల్ల అనుబంధంలో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని అన్నారు.

షర్మిల కట్టుకున్న చీర‌పై జగన్ కామెంట్లు

సీఎం జ‌గ‌న్‌, ఇదే చీర‌పై కామెంట్లు చేశారు. ప‌సుపు రంగు చీర క‌ట్టుకుని, వైఎస్ శ‌త్రువుల‌కు ఆహ్వాన ప‌త్రిక‌లు అందించారంటూ నాటి ఘ‌ట‌న‌ను పులివెందుల రాజకీయ సభలో తెరపైకి తీసుకొచ్చారు.

స్పందించిన వైఎస్ షర్మిల:

తాను కట్టుకున్న చీర గురించి రాజకీయ వేదికపై జగన్ సభలో మాట్లాడటం దారుణంమని వైఎస్ షర్మిల మండిపడ్డారు.

సొంతచెల్లెలు వేసుకున్న బట్టలపై వేల మంది సభలో మాట్లాడుతారా

ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఇంత దిగజారుడు రాజకీయాలు ఏం అవసరం ఉంది

నా వొంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా

అంటూ తీవ్ర స్థాయిలో జగన్ పై విరుచుకుపడ్డారు.

జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా
అని ప్రశ్నించారు.
చంద్రబాబు స్క్రిప్ట్ నేను చదువుతున్నానా

పసుపు రంగు ఏమైనా చంద్రబాబుకు పేటెంట్ రైటా

అని ఆమె ప్రశ్నించారు.

పసుపు మంగళకరమైన రంగు అని స్వయంగా వైఎస్‌ చెప్పారని ఆమె గుర్తు చేశారు. చూసుకుంటూ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేది జగనే అంటూ సెటైర్ వేశారు.

అసెంబ్లీలో వైఎస్‌ను తిట్టినవారు ఇవాళ జగన్‌కు బంధువులంటూ షర్మిల ప్రతి దాడికి దిగారు.

చంద్రబాబు రియాక్షన్:

ఇదే అంశంపై తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. “తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా ఎంత నీచం ఇది కాదా వికృత మనస్తత్వం అని సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి చంద్రబాబు నిప్పులు చెరిగారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading