నారద వర్తమాన సమాచారం
సంక్షేమ రాజ్యం మళ్లీ తెచ్చుకుందాం..
వైఎస్సార్ సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు
గణేశునివారిపాలెం, సందెపూడి, తుర్లపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం
యడ్లపాడు మండలంలోని గణేశునివారిపాలెం, సందెపూడి,తుర్లపాడు గ్రామాల్లో కావటి మనోహర్ నాయుడు ఆదివారం రాత్రి పర్యటించారు. ముందుగా వినాయకుని, పోలేరమ్మతల్లి, రామాలయం, నాలుగు చర్చిల్లో పూజలు, ప్రార్థనలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 019లో అధికారం చేపట్టిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్న సంక్షేమపథకాల నుప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని కాంక్షించారన్నారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చి ప్రతి ఇంటి ముంగిటకే ప్రభుత్వ పథకాలను తీసుకువచ్చారన్నారు. కులమత బేధాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా పారదర్శక పాలన అందించిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల విశ్వసనీయతను పొంది, ఇతర రాష్ట్రల సీఎంలు, వివిధ పార్టీల నాయకుల ప్రశంసలు అందుకున్నారని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలన ఇదేవిధంగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో జగనన్నకు మద్దతునిచ్చి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ రెండు ఓట్లను వేసి చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పి అనిల్ కుమార్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఘంటా శంకర్, ఏఎంసీ మాజి చైర్మన్ బొల్లెద్దు చిన్న, నాయకులు మద్దినేని సుందరయ్య, పంగులూరి సుబ్బారావు, కన్నెగంటి శ్రీను, సందెపూడి బొప్పూడి కృష్ణమూర్తి, చుండి రమేష్, గణేశుని నాగయ్య, మాదాసు శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పున్నయ్య, గుర్రం వీరరాఘవయ్య, సర్పంచ్ రావూరి వేణుగోపాలరావు, వడ్లాన అంకమ్మరావు, చంద్రం, శ్రీనివాసరావు, షేక్ మస్తాన్, శ్రీధర్, మాబుసుభాని, గౌరు రాజేష్, ఎ శ్యాంపాల్, కె శామ్యేల్‌పాల్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.