నారద వర్తమాన సమాచారం
సామాన్యుడు సైతం సమాజ సేవలో….
*నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న రాపోలు లింగస్వామి **
*సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకత ను చాటుకుంటున్న రాపోలు **
సమాజ సేవ చేయడానికి పేదరికం అడ్డుకాదని నిరూపించాడు*తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత రాపోలు **
**సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి **ఆర్ టి ఐ రక్షక్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాపోలు లింగస్వామి **
ఎల్ బీ నగర్
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన అత్యంత వెనుకబడిన కుమ్మర కులానికి చెందిన రాపోలు బిక్షమయ్య, లక్ష్మమ్మ ల చిన్న కుమారుడు రాపోలు లింగస్వామి నిరుపేద కుటుంబం అయినప్పటికీ చదువుపై ఉన్న మక్కువ తో చదివే ఆర్ధిక స్తొమత లేకపోయినప్పటికి హాస్టల్ లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ మరోపక్క కుటుంబానికి చేదోడువాడోడుగా ఉంటూ వారితో కలిసి కూలి పనులు చేస్తూ చేతనైనా సహాయం చేస్తూ జీవనం కొనసాగించారు. గత 30సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వలస రావడం జరిగింది.పేద కుటుంబం అయినప్పటికీ అతని ఆలోచనలు చిన్న నాటి నుండి సమాజం పట్ల మక్కువ, సమాజం కోసం ఏదైనా తనవంతు చేయాలనీ తరచూ తన పేదరికాన్ని తలుచుకుంటూ తరాలు మారినా కానీ పేదల బతుకులు మారడం లేదని,పూట గడవని స్థితిలో ఉండడం ఏంటని పదే పదే ఆలోచిస్తూ ఉండేవారు.పేదరికం తెలిసిన వ్యక్తిగా, కష్టం విలువ తెలిసిన వ్యక్తి ఎప్పుడు ఎవ్వరికి హాని కలిగించని అతని సేవా బావ గుణమే జర్నలిజం వైపు మళ్ళింది. జర్నలిస్టుగా పని చేస్తూనే మరింత సమాజ సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఏదైనా సంఘంలో చేరి పని చేయాలనీ ఎదురుచూస్తున్నా తరుణంలో గత ఆరు, ఏడు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో చుసి సమాచార హక్కు రక్షణ చట్టం (2005) సంఘంలో డివిజన్ అధ్యక్షుడు గా చేరి తనకున్న అవగాహన మేరకు చట్టాన్ని ప్రజల్లోకి అవగాహన కల్పించిండంతో పాటు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, సంఘం బలోపేతం చేయడం సభ్యులందరిని కలుపుకునిపోవడం పాటు సమాజంలో ఒక జర్నలిస్టుగా ప్రముఖ పేరొందిన ఆర్ టి ఐ కార్యకర్తల గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న రాపోలు లింగస్వామి సేవలను గుర్తిస్తూ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరును నమోదు కావడంతో అవార్డును మాజీ మంత్రి సభితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా అందుకోవడం జరిగింది. అదే విధం గా తన సేవలను క్రాంతి జ్యోతి సంస్థ వారు వివిధ రంగాలలో స్వచ్చందంగా సేవాలం దిస్తున్న వారిని గుర్తించి హనుమకొండ పరకాలలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో 2023 ఎక్షలెన్స్ అవార్డు తో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్ నేషనల్ 2023అవార్డును అందించి సత్కరించి ప్రశంస పత్రాన్ని అందుకోవడం జరిగింది.టీ ఆర్ వి ఎస్ అద్వర్యం లో వివిధ రంగాలలో సేవలు చేస్తున్న వారిని గుర్తించి 2023లో రవీంద్ర భారతిలో తెలంగాణ పురస్కార్ అవార్డు, ప్రశంశ పత్రాన్ని అందించి ఘన సన్మానం చేయడం జరిగింది. అతను ఏ కార్యక్రమం గాని, స్టేట్మెంట్స్ గాని ఏ పని చేసిన కానీ అది సమాజానికి ఉపయోగపడే విధంగా నలుగురు ఆలోచించే విధంగా ఉంటుంది. అతని సేవా బావ గుణమే నేడు రాష్ట్రంలో నే తనకంటూ ఒక మంచి పేరు ప్రక్యాతాలు సంపాదించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచనలమైన హైదరాబాద్ సింగరేణి చైత్ర బాయి ఘటనపై స్పందించి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేసి నిందితుణ్ణి వెంటనే శిక్షించాలని కోరుతూ రాపోలు
లింగస్వామి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి పూర్తి మద్దతు తెలుపుతూరోడ్డుపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అతని ఆలోచన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే స్వభావం కలవారు.రాపోలు లింగస్వామి సమాజ కోసం సేవ చేసేవారికి ఈ సమాజంలో తగిన గుర్తింపు ఉంటుందని అవార్డుల రాకతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సమాచార హక్కు చట్టాన్ని గ్రామ స్థాయి వరకు ప్రజలకు అవగాహన కల్పించడం తోపాటు అవినీతి రహిత సమాజం కోసం ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తానని ప్రముఖ ఆర్ టి ఐ రక్షక్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, సమాజ సేవకులు,తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత రాపోలు లింగస్వామి తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.