


నారద వర్తమాన సమాచారం
మేడే సందర్భంగా ఏపీజీఈఏ క్రోసూ రు అధ్యక్షులు శిఖా శాంసన్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలకు మజ్జిగ పంపిణీ
మేడే సందర్భంగా వేసవి తాపము దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా కోసూరు తాలూకా యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ పర్యవేక్షణలో బుధవారం మండలంలోని ఆశా కార్యకర్తలకు సిబ్బందికి ఆయుర్వేద గుణాలతో కూడిన చల్లటి మజ్జిగను పంపిణీ చేయడం జరిగింది భరించలేని 45 డిగ్రీల సెల్సియస్ డిగ్రీలో విపరీతమైన ఎండలో కూడా అలుపెరగక ప్రజల ఆరోగ్య పరిరక్షణ విధులను బాధ్యతగా నిర్వహిస్తున్న క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సేవలను గుర్తించి వారి ఆరోగ్యానికి ఎటువంటి ఆటంకాలు కలుగకూడదనే ఆలోచనతో కృతజ్ఞతగా ఈ మజ్జిగ పంపిణీ చేసినట్లు శిఖా శాంసన్ తెలిపారు అధిక ఎండ, వాన, చలి లాంటి ప్రతికూల వాతావరణం లో అందరూ సహజంగా బయటకు అడుగు వేయకుండా ఇంటిపట్టునే సేదతీరుతారు కానీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి అటువంటి అవకాశం ఉండదని, 24 గంటలు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తమ ఆరోగ్యాన్ని కుటుంబాల్ని లెక్కచేయకుండా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుందని అటువంటి వైద్య ఆరోగ్య శాఖ వ్యవస్థను గుర్తించి వారికి మజ్జిగను పంపిణీ చేయటం అభినందనీయమని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భూలక్ష్మి ఆరోగ్య కార్యకర్తలు అనుపమ, కోటేశ్వరమ్మ, ఆశా కార్యకర్తలు అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీజీఏ కార్యదర్శి బండి రత్తయ్య కార్యవర్గ బాధ్యులు శివుడు, అమర జ్యోతి తదితరులు పాల్గొన్నారు







