నారద వర్తమాన సమాచారం
‘మెగా పేరెంట్స్ & టీచర్స్ 2.O కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు
ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించాలి
విద్యార్థులు, తల్లితండ్రులు, ప్రముఖులు అందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి- కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వీడియో కాన్ఫరెన్స్
జిల్లాలో ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న ‘మెగా పేరెంట్స్ టీచర్స్ 2.0 కార్యక్రమం నకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ‘మెగా పేరెంట్స్ టీచర్స్ 2.౦ కార్యక్రమం ఏర్పాట్లపై ఆదివారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ పి అరుణ్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,308 పాఠశాలల్లోనూ, మరియు 91 జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆరోజు జరగనున్న కార్యక్రమాలపై ఇన్విటేషన్ రూపొందించి విద్యార్థుల తల్లితండ్రులకు, ప్రముఖులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి విద్యార్థులందరూ యూనిఫామ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో
మెగా పేరెంట్స్ టీచర్స్ 2.౦ కార్యక్రమం ‘జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, తల్లితండ్రులు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి భోజన సదుపాయాలతో ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్తగా వండించాలన్నారు. పాఠశాల కిచెన్ లో అగ్నిప్రమాదలు వంటి చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలనీ, అగ్నిమాపక సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. విద్యార్థులచే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం అటవీ శాఖ అధికారులు మొక్కలను సిద్ధం చేశారని, పాఠశాలలకు అవసరమైన మొక్కలను దగ్గరలోని అటవీశాఖ నర్సరీ ద్వారా పొందాలన్నారు. తల్లితండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఫోటో సెషన్ నిర్వహించాలని, అమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా తల్లికి వందనం నిర్వహించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థినీ విద్యార్థులకు వైద్య పరీక్షలు వెంటనే పూర్తి చేసి, కార్యక్రమం రోజున విద్యార్థుల ఆరోగ్య నివేదిక ను అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మానసిక ఆరోగ్యం,సైబర్ క్రైమ్ పై అవగాహన, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేశాలు, పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా
‘మెగా పేరెంట్స్ టీచర్స్
2.౦ కార్యక్రమం నిర్వహించేలా సంబందించి పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలన్నారు. కార్యక్రమం ఏర్పాట్ల పనులు, 10 వతేదీన ‘మెగా పేరెంట్స్ టీచర్స్ 2.౦ కార్యక్రమం నిర్వహణను ‘LEAP యాప్’ లో పొందుపరచాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








