Monday, December 2, 2024

మే1 ఈరోజు నుండి నర్మదానది పుష్కరాలు

నారద వర్తమాన సమాచారం

మే1 ఈరోజు నుండి నర్మదానది పుష్కరాలు

నర్మదానది పుష్కరాలు 2024
పుష్కరం అనేది నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయ పండుగ. ఇది భారతదేశంలోని 12 ప్రధాన పవిత్ర నదుల ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో, పూర్వీకుల ఆరాధన , ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుపుకుంటారు. ఈ వేడుక ప్రతి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం పండుగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతీయ వైవిధ్యాల కారణంగా, కొన్ని రాశిచక్ర గుర్తులు బహుళ నదులతో సంబంధం కలిగి ఉంటాయి.

నర్మదా పుష్కరం సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నర్మదా నది పండుగ. ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ రాశి (వృషభ రాశి)లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు జరుపుకుంటారు.
ఈ సంవత్సరం నర్మదా పుష్కరలు 2024 మే 1 నుండి ప్రారంభం అయ్యి మే 12న ముగుస్తాయి.

అమర్‌కంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం మరియు భోజ్‌పూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నరమదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి అమ్రార్కంటక్ ఉత్తమమైన ప్రదేశాలు.

ఓంకారేశ్వర్‌లో నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్‌లు నిర్మించబడ్డాయి.ఈ నది ప్రవాహం నిరంతరం మరియు స్థిరంగా ఉంటుంది మరియు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఘాట్‌లపై నది లోతు ఎక్కువగా ఉండదు. మరియు భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు.
భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనుప వలలు, పట్టుకునే చైన్‌లను ఏర్పాటు చేశారు. వారి భద్రత కోసం సేఫ్టీ బోటు కూడా ఏర్పాటు చేశారు.

ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్‌లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుంది.

ఓంకారేశ్వర్‌లోని ఇతర ముఖ్యమైన ఘాట్‌లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
చకర్ తీర్థ ఘాట్, గౌముఖ్ ఘాట్, భైరోన్ ఘాట్, కేవల్రామ్ ఘాట్,నగర్ ఘాట్, బ్రహ్మపురి ఘాట్, సంగం ఘాట్, అభయ్ ఘాట్

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ ‘పుష్కరాలు’ వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

పుష్కర సమయంలో పిండ ప్రదానం
సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.
శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి.
పుష్కరకాల స్నానం నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం, మార్జనం అనేశక్తులున్నాయని వేదం వివరిస్తుంది.మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే మార్జన అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం.ఆసమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.
త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది.నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.
ఇసుకతో కాని, మట్టితో కాని పార్థీవ శివలింగాన్ని చేసి పూజించాలంటారు. నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ల నీళ్లతో ఆశీస్సులు అందజేస్తారు. గోదావరికి దీప దానం కూడా చేస్తారు.

పుష్కరాలు జరిగే ప్రదేశాలు

మన దేశంలోని 12 పుణ్య నదుల్లో ఒక్కో నదికి పన్నెండేళ్లకోసారి పుష్కరాల పేరుతో వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

మోక్షం లభిస్తుందని నమ్మకం :పుష్కరకాలం సంవత్సరం మొత్తం ఉంటుంది. పుష్కరాలలో మొదటి 12 రోజులు ఆది పుష్కరం, చివరి 12 రోజులు అంత్య పుష్కరం అని పిలుస్తారు. బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే, పుష్కరాలను నిర్వహించే మొదటి 12 రోజులు, చివరి పన్నెండు రోజులు నదిలో పుష్కరుడు సకల దేవతలతో కలిసి ఉంటాడని,ఈ సమయంలో పవిత్ర నది స్నానమాచరిస్తే సకల తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం దక్కి, మోక్షం లభిస్తుందని పేర్కొన్నారు. మరి నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరుగుతాయో ఇప్పుడు చూద్దాం

అమర్‌కంఠక్‌
నర్మదా నది మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్‌లో ఆవిర్భవించి.. పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లలో వేలాది మైళ్లు ప్రవహించి.. పారిశ్రామిక నగరమైన సూరత్‌ను అక్కున చేర్చుకొని, అరేబియా సముద్రంలో కలుస్తుంది. మధ్యప్రదేశ్‌లో నర్మదా నది ప్రవహించే ప్రాంతాలలో అమర్‌కంఠక్‌ను హిందువులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు

జబల్‌పుర్‌
నర్మదా నది ఒడ్డున ఉన్న మరొక పవిత్రమైన పట్టణం మధ్యప్రదేశ్లోని జబల్‌పుర్‌. ఇక్కడికి పుష్కర స్నానం చేయడానికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జబల్‌పుర్‌లో పవిత్ర నదీ స్నానం చేసిన తర్వాత హనుమంతల్‌ బడా జైన్‌మందిర్‌, మదన్‌ మహల్‌, దుమ్నా ప్రకృతి ఉద్యానవనం, రాణి దుర్గావతి మ్యూజియం తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు

హోషంగాబాద్‌
నర్మదా నది పుష్కరాలను మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న సేతుని ఘాట్‌లో నదీ స్నానం చేయడానికి, పూజలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు

ఓంకారేశ్వర్‌
మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వర్‌ పట్టణం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర పుణ్య క్షేత్రం విరాజిల్లు తోంది. పుష్కర సమయంలో ఇక్కడ స్నానం చేసి మోక్షం పొందడానికి లక్షల మంది భక్తులు తరలివస్తారు

మహేశ్వర్
మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున మహేశ్వర్ పట్టణం ఉంది

భరూచ్
మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్‌లో జన్మించిన నర్మదా నది.. గుజరాత్‌లోని భరూచ్‌ జిల్లా మార్గాన ప్రవహించి చివరిగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఈ పట్టణం ఉందని చారిత్రక ఆధారాలున్నాయి.

శ్రీమాత్రే నమః


సేకరణ

పొన్నెకంటి శ్రీనివాసాచారి


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading