నారద వర్తమాన సమాచారం
కూటమి ప్రభుత్వంతో యువతకు దేశవిదేశాల్లోనూ ఉద్యోగాలు: ప్రత్తిపాటి
చిలకలూరిపేటలో ఎన్నారైలతో ప్రత్తిపాటి పుల్లారావు సమావేశం
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నైపుణ్యాభివృద్ది, కొత్త కోర్సుల ద్వారా రాష్ట్ర యువతకి తిరిగి దేశవిదేశాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. ప్రస్తుతం యువత అంతా ఉపాధి, ఉద్యోగ మేళాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, అలాంటివారంతా ఒక్క వారం రోజులు కష్టపడితే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. శనివారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ప్రతినిధులతో ప్రత్తిపాటి పుల్లారావు సమావేశం నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షుడు వేమూరి రవి, తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్ రైజ్ ఏపీ క్యాంపెయిన్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావును కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి ముఖ్యమంత్రి జగన్ గడిచిన అయిదేళ్లలో యువత భవితను పూర్తిగా అంధకారం చేసే శారన్నారు. గ్రాడ్యూయేషన్లు పూర్తి చేసుకున్న విద్యార్థులకు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో సరైన మార్గదర్శనం అందించడం చాలా అవసరం అన్నారు. రవి వేమూరితో కలసి గతంలో 50, 60మందికి ఆ దిశగా నైపుణ్యాభివృద్ధి సర్టిఫికేట్లు కూడా అంది ంచామన్నారు ప్రత్తిపాటి. కొంతమందికి విదేశాల్లో ఉద్యోగాలు కూడా కల్పించామని తెలిపారు. ఆ దిశగా ఇప్పుడు చిలుకలూరిపేటలో ప్రత్యేకసెల్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలిప్పిస్తామ ని వచ్చినందుకు ఎన్నారైలకు పేరుపేరున అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు ప్రత్తిపాటి. ఎన్నారై టీడీపీ ద్వారా కల్పించాలని అనుకుంటున్న లక్ష ఉద్యోగాల్లో చిలకలూరిపేట యువత ఎక్కువమంది ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం మాట్లాడిన రవి వేమూరి చంద్రబాబు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ మేరకు.. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నారై విభాగం ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలని సంకల్పం తీసుకున్నా మన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచి యూరప్, అమెరికా, గల్ఫ్ సహా వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి, జగన్ పాలనలో జరిగిన నష్టంపై యువతలో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు రవి. గతంతో పోల్చుకుంటే ఈసారి తెదేపా తరఫున ప్రచారం చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు వచ్చారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని చూడలేకే వేల డాలర్ల సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడకు వచ్చి ప్రచారం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎన్నారై సభ్యులంతా తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.