నారద వర్తమాన సమాచారం
బంగారు భవిష్యత్తు కోసం బాబును మళ్లీ రప్పిద్దాం
శ్రమ శక్తిని గౌరవించుకుందాం..శ్రామికుల్ని గెలిపించుకుందాం..
జగన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేసి ఆస్తులకు రక్షణగా నిలుస్తాం
అభివృద్ధి, సంపద సృష్టి చేసే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కూటమి ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణ దేవరాయలు,డా.చదలవాడ అరవింద బాబు విన్నపం
నరసరావుపేట టౌన్:-
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించి,సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచే సమోన్నత లక్ష్యం కలిగిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తోడుగా నిలవాలని ఎన్డీఏ నరసరావుపేట ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణ దేవరాయలు,డా.చదలవాడ అరవింద బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ల్యాండ్,శాండ్,వైన్,మైన్ లాంటి విధానాలతో రాష్ట్రాన్ని,ప్రజల సంపదను దోచుకోవాలని జగన్ రెడ్డి చూస్తున్నాడని,కానీ,ప్రజల సంపద పెంచి ప్రజలకు అండగా నిలుస్తానని ప్రకటించిన నాయకుడు చంద్రబాబు అన్నారు.ఈ మేరకు నరసరావుపేట 6,7, 8వ వార్డుల పరిధిలో ఎంపీ అభ్యర్ది లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మండుటెండలో ప్రజల కోసం ప్రజలకు ఏం చేస్తామో,ఏం చేశామో చెబుతూ పర్యటించారు.ప్రజల కోసం ఎంతైనా త్యాగానికి సిద్ధమన్న డా.చదలవాడ అరవింద బాబు నిబద్దతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.పర్యటన మొత్తం వేలాది మంది కార్యకర్తలు,నాయకులు,ప్రజలు పూలహారతులిచ్చారు.అధికారంలోకి వచ్చాక తొలి సంతకంతో డీఎస్సీ నిర్వహించి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తానని,తొలి వంద రోజుల్లోనే గంజాయి,డ్రగ్స్,కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపి యువతను రక్షించుకుంటానని ప్రకటించిన దమ్మున్న నాయకుడు చంద్రబాబు మాత్రమేనని లావు,డా.చదలవాడ అన్నారు.నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యనీ పరిష్కరించి సామాన్యులకు అండగా నిలుస్తానన్నారు.నియోజకవర్గంలో భూ కబ్జాలు అరికట్టి,తాగు సాగునీటి సమస్యలు పరిష్కరించే బాద్యత నేను తీసుకుంటానని డా.చదలవాడ అరవింద బాబు ప్రజలకు హామీ ఇచ్చారు.ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ రెండు సెంట్ల స్థలం ఇచ్చి,ఇల్లు కట్టించి అందిస్తానని లావు,డా.చదలవాడ భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇంచార్జి జిలాని,కపిలవాయి విజయ్,నల్లపాటి రాము తదితర ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.