నారద వర్తమాన సమాచారం
మేనిఫెస్టోలో ఉత్తుత్తి హామీలతో రైతుల్ని మోసం చేస్తున్న జగన్: ప్రత్తిపాటి
ప్రత్తిపాటి సమక్షంలో తెలుగుదేశంలో చేరిన వైసీపీ నాయకులు
ఎన్నికల వేళ మరోసారి ఉత్తుత్తి హామీల మేనిఫెస్టోతో ప్రజల్ని మోసం చేస్తోన్న ముఖ్యమంత్రి జగన్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. మరీ ముఖ్యంగా రైతుల పట్ల మొసలికన్నీళ్లు కార్చుతున్న జగన్‌కు వారి ఓటడిగే అర్హతే లేదన్నారు. రాష్ట్రానికి జీవనాడి, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ పేరును సార్థకం చేసే పోలవరంలో విధ్వంసం నుంచ రైతులకు ఇచ్చిన అన్ని వాగ్దానాల్ని జగన్ తుంగలోకి తొక్కడమే అందుకు కారణమన్నారు ప్రత్తిపాటి. చిలకలూరిపేట వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. చిలకలూరిపేట సుగాలి కాలనీ, ఆది ఆంధ్ర కాలనీ నుంచి వైసీపీ 50 కుటుంబాలు కొత్త కృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరాయి. యడ్లపాడు మండలం కారుచోలకు చెందిన వైసీపీ నాయకులు కారుమూడి బొల్లారెడ్డి, కారుమూడి రవీంద్రరెడ్డి, ఈమని రవీంద్ర, నల్లజం భీముడు, మల్లు సాయి, నల్లజం గోపి, రాజనాల శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి వీడ్కోలు పలికి తెలుగుదేశంలో చేరారు. చిలకలూరిపేటలో జరిగిన కార్యక్రమాల్లో వారందరికీ ప్రత్తిపాటి పుల్లారావు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి రైతులకు మాటిచ్చిన సున్నావడ్డీ, పావలా వడ్డీ పథకాల్ని కూడా అమలు చేయని మోసకారి ముఖ్యమంత్రి జగన్ అని ధ్వజమెత్తారు. అయిదేళ్లపాటు రైతుల్ని వడ్డీవ్యాపారుల పాల్జేసింది కాక దొంగప్రేమ నటనలు ఎందుకని ప్రశ్నించారు. వడ్డీ రాయితీల రైతులకు ఇవ్వాల్సి న రూ. 26 వేలకోట్లు ఎగ్గొట్టిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. ఎన్నోగొప్పలు చెప్పుకున్న జగన్ ఈ అయిదేళ్లలో రైతుల సున్నావడ్డీకి ఇచ్చింది కేవలం రూ. 848కోట్లే అని చురకలు వేశారు ప్రత్తిపాటి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.