

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ చేపట్టిన జన జాతర,భారీ రోడ్ షోలో పాల్గొన్న ఎఐసిసి అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ, సిఎం రేవంత్ రెడ్డి..
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే11,
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన భారీ రోడ్ షోలో పాల్గొన్న ఎఐసిసి అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఎఐసిసి పరిశీలకురాలు దీపాదాస్ మున్షి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్..ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ..దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అప్పుడే పేదలకు మేలు జరుగుతుంది.
కాంగ్రెస్ వస్తే ప్రతి మహిళ అకౌంట్లో లక్ష రూపాయలు వేస్తాం.రైతులపై జిఎస్టీ ఎత్తివేస్తాం,డిగ్రీ చదివిన విద్యార్థులకు లక్ష రూపాయలు వచ్చేలా ఉద్యోగం కల్పిస్తాం.
ఉపాధి కూలీలకు మినిమం 400 కూలి గిట్టుబాటు కల్పిస్తాం.ప్రధాని మోడీ పదేళ్ళలో ప్రజలకు చేసిందేమీ లేదు.దేశ సంపదను పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారు.16లక్షల కోట్లు మోడీ మిత్రవర్గానికి మాఫీ చేశారు.రైతాంగానికి మాత్రం మోడీ మొండిచేయి చూపారు.
ఈ దేశం ప్రేమ, అహింస, సత్యంపై ఆధారపడి ఉంది.దేశ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటే బీజేపీ వారి మధ్య కోట్లాటపెడుతుంది.తెలంగాణ నుంచి మార్పు మొదలైంది. ఇక బీజేపీ పని ఖతమే దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అంటే కాంగ్రెస్ గెలవాలి.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు తొలగించేందుకే మోడీ 400సీట్లు అడుగుతున్నాడు.కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4 వేల కిలోమీటర్లు దళిత, గిరిజనులు, బలహీన వర్గాలకు రాజ్యాంగాన్ని రక్షించడం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు.ఈడీ,సిబిఐ, ఐటీ, ఢిల్లీ పోలీస్, అంబానీ, ఆధాని మోడీ పరివార్.
సోనియాగాంధీ,ప్రియాంక గాంధీ,రాష్ట్ర నాయకులం, కార్యకర్తలు రాహుల్ గాంధీ పరివార్.ఈ ఎన్నికలు మోడీ పరివార్ రాహుల్ పరివార్ మధ్య జరుగుతున్నాయి.కామారెడ్డిలో
సురేష్ షెట్కార్ కు లక్ష మెజారిటీ పక్కా ఇవ్వాలి అని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.