నారద వర్తమాన సమాచారం
కాంగ్రెస్ ట్రాప్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు పడొద్దు.
కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లు రద్దు అవుతాయని కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఎస్సీ, ఎస్టీ బీసీలు నమ్మొద్దు,
ప్రస్తుత రేవంత్ పాలనపై విమర్శలు పెరిగిన పరిస్థితిలో ప్రజల అభిమానం చూరగొనేందుకు రిజర్వేషన్ పొందుతున్న వర్గాలను భయానికి గురిచేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది.
రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు రద్దు అనేవి నరేంద్ర మోదీ జరిగనివ్వడు,.
రాజ్యాంగం రిజర్వేషన్లు మోడీ ద్వారానే భద్రంగా ఉంటాయి.
ఇప్పుడే కాదు 2029లో కూడా. మోడీనే ప్రధాని కావాలని కోరుతున్నాం.
రాజ్యాంగాన్ని కాపాడడంలో మోదీ ముందు వరుసలో ఉంటారు.
మల్లికార్జున్ ఖర్గే వయసు పెరిగి మానసిక స్థితి బాగలేక మాట్లాడుతున్నారు.
ఆయన ఆధ్వర్యంలోనే ఎస్సీ ఎస్టీలకు చేవెళ్ల డిక్లరేషన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచుకోవచ్చు, దానికి రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదు.
ఎన్టీఆర్ కేసీఆర్ పెంచారు. ఖర్గే , రేవంత్ చేతుల మీదుగా రిజర్వేషన్ల పెంపు చేయవచ్చు. ఎందుకు చేయడం లేదు. ఎవరైనా అడ్డు పడ్డారా?
ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో బీజేపీకి ముందు కాంగ్రెస్ ఉండింది ఎందుకు పెంచలేదు.
కర్నాటకలో రిజర్వేషన్లు బిజేపి ఆధ్వర్యంలోనే పెంచారు.
అసత్య ప్రచారం పదిసార్లు చెప్తే సత్యంగా మారుతుందని ప్రజలు భావిస్తారని ఈ పని చేస్తున్నారు.
కాంగ్రెస్ మాదిగ, నేతకాని కులాలకు టికెట్లు ఇవ్వలేదు, దీనిపై ప్రతి మాదిగ పల్లెలో చర్చ జరుగుతోంది.
రెడ్డిలకు ఏడు, బీసీలకు 2 స్థానాలు ఇచ్చాడు. అందువల్ల బిసిలు దూరం అయ్యరు.
బిసిల, మాదిగల ఓట్లు దూరం అవుతున్నాయని భావించిన కాంగ్రెస్ సమాధానం ఇవ్వలేక గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారు.
మాల మేధావులను గ్లోబల్ ప్రచారానికి వాడుకుంటున్నారు.
భాజపా బలపడితే దొరలకు పటేళ్లకు నిద్ర పట్టదు.
కాంగ్రెస్ రెడ్లకు, భారాస కుటుంబానికి తప్ప సీఎం దాకా ఎవ్వరినీ రానివ్వరు.
తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తె బీసీలకు మేలు.
భాజపా బలపడితే అశాంతి అనేది ఆ రెండు వర్గాలకు మాత్రమే ఉంటుంది.
400 సీట్లు అనేది భాజపా కలలు కంటోంది అంటున్నారు. కలలు కనండి నిజం చేసుకోండని అబ్దుల్ కలాం చెప్పారు.
కాంగ్రెస్ 40 సీట్లకోసం కూడా కలలు కనడం లేదు. మీకు కష్టపడే స్ఫూర్తి లేదు.
రేవంత్ రెడ్డి పార్టీలు మారింది నేను కాదు నీవే. వర్గీకరణ చేస్తామంటే 1998లో చంద్రబాబుకి, తర్వాత వైఎస్ కు మద్దతు ఇచ్చారు, నేడు మోదీ చేస్తానంటే మద్దతు ఇస్తున్నాం. తప్ప ఏనాడు పార్టీ కండువా వేసుకోలేదు.
రేవంత్ రెడ్డి పిట్టల దొరల మాటలు ఎమ్మార్పీఎస్ పై చెల్లవు. ఎమ్మార్పీఎస్ పై విమర్శలు చేస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లె. రేవంత్ నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
దేశం అభివృద్ధి జరగాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే భాజపా గెలవాలి. మోదీ ప్రధానిగా ఉండాలి.
మోదీ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాడు.
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ..
సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ సమాధి చేస్తోంది
ఎస్సీ స్థానాల్లో, కంటోన్మెంట్ 4 స్థానాల్లో సామాజిక న్యాయం పాటించలేదు. ఒక్క సీటు కూడా మాదిగలకు ఇవ్వలేదు.
మాదిగలు, నేతకానిలకి అన్యాయం చేసింది.
భాజపా 3 భాజపా, 1 నేతకానికి ఇచ్చి సామాజిక న్యాయం పాటించింది.
బీజేపీను భారీ మెజారిటీతో గెలిపించాలి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.