

గంట పాటు పోలింగ్ ను బహిష్కరించిన రైతులు…
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
మండల పరిధిలోని కనుముకల గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన ధాన్యం తడిసింది. దీంతో రైతులు ఉదయం 7:30 గంటలకు రోడ్డుపై బైఠాయించి దాన్యం కొనుగోలు చేసేంతవరకు పోలింగ్ లో పాల్గొనమని భీష్మించు కూర్చున్నారు. ఒక్కరు కూడా ఓటు వేయకపోవడంతో తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు. దాదాపు గంట పాటు ఓటింగ్ జరగకపోవడంతో పోలింగ్ కేంద్రం బోసిపోయింది.








