
నారద వర్తమాన సమాచారం
మే :16
నంద్యాల జిల్లా..శ్రీశైలం పోలీస్టేషన్ లో కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీశైలంలో స్దానికులను , పోలీసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్లు చేసింది.
శ్రీశైలం పోలీస్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శివశంకర్ రెడ్డి ఇవాళ తెల్లవారుజామున సుమారు ఐదుగంటల సమయంలో స్టేషన్ లోని రెస్ట్ రూములో సర్వీస్ గన్ తో తలకు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీశైలం పోలీసులు చర్చించుకుంటున్నారు. కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి స్వగ్రామం కర్నూలుగా పోలీసులు గుర్తించారు అయితే ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి 2001వ బ్యాచ్ గా పోలీసులు తెలిపారు. శివశంకర్ రెడ్డి ఆత్మహత్య తెలుసుకున్న వార్త తెలియగానే శ్రీశైలం పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సిఐ ప్రసాదరావు హుటాహుటిన స్టేషన్ కు చేరుకుని ఘటన స్దలాన్ని పరిశీలించారు. మృతి చెందిన శివశంకర్ రెడ్డి కుటుంభికులకు పోలీసులు సమాచారం అందించారు. విషయాన్ని ఉన్నతస్దాయి అధికారులకు తెలిపామని సిఐ అన్నారు.