నారద వర్తమాన సమాచారం
జోరు వానలోనూ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది…
కార్డెన్ సెర్చ్ తో నలుమూలల జల్లెడపడుతున్న పోలీసులు…
సత్తెనపల్లి:
పల్నాడు జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో సత్తెనపల్లి పట్టణ మరియు రూరల్ పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు.జోరుగా వాన పడుతున్న కూడా తమ విధులను నిర్వర్తించడంలో సత్తెనపల్లి పట్టణ పోలీసులు నిమగ్నమయ్యారు.పోలింగ్ పూర్తైన తర్వాత కొంత రిలాక్స్ అవుదాం అనుకున్న పోలీసులకు నాయకులు మరియు ఆందోళనకారులు గట్టి షాక్ ఇచ్చారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఘర్షణలు జరగటంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.కౌంటింగ్ పూర్తయ్యే వరకు సెలవులు ఇచ్చేది లేదని పోలీస్ శాఖ తేల్చి చెప్పేసింది.ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గములోనీ అనేక ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ లు చేస్తున్నారు.పోల్ డే హింస నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. హింసాత్మక ఘటనలు,ఎన్నికల కమిషన్ (ఈసీ)వేటుతో పోలీసుల్లో వణుకు మొదలైంది.మూల మూలలా కార్డాన్ చర్చ్ కొనసాగిస్తున్నారు.అల్లర్ల నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. కౌంటింగ్ రోజున హిస్టరీ షీట్స్ ఉన్న వారందర్నీ పోలీస్ స్టేషన్లకు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు.తీవ్రమైన ఎన్నికల నేరాలకు పాల్పడే వారిని దూరంగా ఉండే స్టేషన్లకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇక విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై ఇప్పటికే పోలీసులు నిషేధం విధించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.