![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/05/image_editor_output_image1697400906-17169747846037963905238195005216.jpg?resize=386%2C241&ssl=1)
నారద వర్తమాన సమాచారం
మే :29
ఉపాధీ హామీ పనుల్లో గోల్ మాల్.. నిజమా..?
సీనియర్ అసిస్టెంట్ ల చేతి వాటం… అధికారుల అండదండలతోనా..లేక నిర్లక్ష్యధోరణి తోనా…ఉపాధీ పనుల గందరగోళం పై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది…
ప్రకాశం జిల్లాగిద్దలూరు మండలంలోని కొత్త కోట గ్రామ పంచాయతీలో ఉపాదీ హామీ పనుల్లో దొంగ మస్టర్ లు వేసుకొని ప్రజలను, అధికారులను మోసం చేస్తున్నారనే వాదనలు వినవస్తున్నాయి.
ఆన్లైన్ మస్టర్ లో కొందరిని, ఆఫ్ లైన్ మస్టర్ లో తమకు నచ్చిన వారిని పని చేయకున్నా కొందరిని యాడ్ చేసి అప్లోడ్ చేస్తున్నట్టు గ్రామస్తుల నుండి వ్యతిరేకం వ్యక్తం అవుతున్నా పట్టించుకోని మండలాధికారులు.. అయితే ఇదంతా మండలాధికారుల కనుసన్నల్లో జరుగుతుంది అని విమర్శలు కూడా ఉన్నాయి.. ఇందులో నిజానిజాలు సంబంధిత ఉన్నతాధికారులు తెల్చాలని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.కొత్తకోట పంచాయతీ లోని ఓ సీనియర్ అసిస్టెంట్ గ్రామ వాలంటీర్ లకు కూడా నెలంతా హాజరు వేసి వారికి ఉపాధి హామీ పనుల వేతనం ఇప్పించిన ఘనత. వాలంటీర్ లకు వారానికి మూడు రోజులు మాత్రమే మస్టర్ వేయాలన్న నియమాన్ని కూడా పక్కన పెట్టిన వైనం, అదే పనిగా వారికి ఈ నెల వాలంటీర్ పనికి స్ట్రైఫండ్ ఇచ్చిన అధికార ఘనం.. ఛీ కొడుతున్న నిరుపేద కూలి.
ఇప్పటికే మట్టి మాఫియా పై విమర్శలు వెలువెత్తుతున్న పట్టించుకోని అధికారులు. ఉపాధీ పనులను సైతం జేసీబీ లతో చేసి పనులు చేయకున్నా చేసినట్టు మస్టర్ లు వేసి ప్రజా ప్రభుత్వ ధనానికి గండి కొడుతున్న నిమ్మకు నీరేతినట్టు వ్యవహారిస్తున్న అధికార యంత్రాంగం..ప్రజా ధనం, ప్రకృతి వనరులకు గండి పడినా మాకెందుకీ వ్యవహారం మాది మాకు అందిందని అధికారులు చేతులెత్తుతారో లేక ప్రజల మన్ననలు పొందే ప్రభుత్వ అధికారులుగా ఉంటారో వారే తేల్చుకోవాలని మండల ప్రజలు అనుకొంటున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.