నారద వర్తమాన సమాచారం
మే:31
పిడుగురాళ్ల మండలంలోని అన్ని గ్రామాల వైఎస్ఆర్సిపి మరియు టిడిపి ముఖ్య నాయకులకు పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో డిఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా సజావుగా జరిగేందుకు పెద్దలందరూ సహకరించాలని కోరడమైనది
అదేవిధంగా ఎవరైనా కౌంటింగ్ సందర్భంగా అల్లర్లకు గొడవలకు పాల్పడిన యెడల లేదా ప్రోత్సహించిన ఎడల వారి మీద కేసులు నమోదు చేసి వారి మీద రౌడీషీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని హెచ్చరించడమైనది
గ్రామాలలో విజయోత్స ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదు
గ్రామాలలో బాణాసంచాలు విక్రయం నిషేధించడమైనది అదేవిధంగా బాణాసంచాలు కాల్చడం కలిగి ఉండడం కూడా నిషేధించడమైనది అని తెలియజేశారు
కౌంటింగ్ సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలో మరియు మండలంలో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది.కావున ఎవరు కూడా ఒకటవ తారీఖు నుంచి నలుగురు అంతకుమించి ఎక్కువగా ఉండరాదు అని తెలియజేశారు
అదేవిధంగా మూడు నాలుగు ఐదు తారీఖులలో గవర్నమెంట్ ఆదేశానుసారం డ్రైడేగా ప్రకటించడం జరిగినది.కావున అన్ని మద్యం షాపులు , బార్ రెస్టారెంట్లు పూర్తిగా మూసి వేయడం జరుగుతుంది
ఇప్పటికే పిడుగురాళ్ల మండలంలో ఎలక్షన్ రోజు జరిగిన గొడవలకు సంబంధించి అరెస్టు చేయడం, వారిని రిమాండ్ చేయడం జరిగినది కావున కౌంటింగ్ రోజు ఎవరు గొడవలకు పాల్పడిన వారి మీద కూడా ఇదే విధంగా కఠిన చర్యలు తీసుకోబడుతాయి అని డీఎస్పీ తెలియజేశారు
ఈ సమావేశంలో గురజాల డిఎస్పి సిహెచ్ శ్రీనివాసరావు, ట్రైన్ డిఎస్పి జగదీష్ , పిడుగురాళ్ల పట్టణ సీఐ వీరాంజనేయులు , సీఐ సుబ్బనాయుడు, పిడుగురాళ్ల ఎస్సై రబ్బానీ ఖాన్ పాల్గొనడం జరిగినది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.