నారద వర్తమాన సమాచారం
తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి పోసింది ఇక్కడే?
తెలంగాణ
:జూన్ 01
తెలంగాణ ఆవిర్భవ ఉత్స వాలు జరుపుకునే ముందు తెలంగాణ పోరాటం ఎక్కడ పురుడు పోసుకుంది, ఎక్కడ మొదలైంది అనే విషయాన్ని ముందు తెలుసుకుందాం.ఉస్మానియా విశ్వవిద్యా లయం ఈ పేరు వింటే మొదట గుర్తొ చ్చేది తెలంగాణ పోరాటమే. ప్రత్యేక రాష్ట్రం కోసం జరి గిన ఉద్యమంలో ఉస్మాని యా విశ్వవిద్యా లయం పాత్ర మర్చిపోలే నిది. విద్యార్థిలోకం పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ చేసిన నినాదాలు ఢిల్లీని కదిలించాయంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు.
నాడు తెలంగాణ ఉద్యమా నికి ఊపిరిపోసింది ఉస్మా నియా విశ్వవిద్యాలయే. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్సి టీ,ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన నేల ఇది. ఉద్యమం ఏదైనా పునాది మాత్రమే ఇక్కడే.
ఆనాడు స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా మొదలైన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. 1969 తొలి దశ ఉద్యమం మొదలు 2014లో తెలం గాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు రణ రంగాన్ని తలపించింది, ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ప్రయా ణంలో ఎన్నో గాయాలు, ఉద్యమ సమయంలో ఆ నేలను తాకిన ప్రతి నెత్తుటి చుక్క సాక్షిగా స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా అలుపెరుగని పోరాటం చేసింది.
ఆనాడు పోరాడిన ఎందరో విద్యార్థుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. కలలు కన్న స్వరాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కదనరంగంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధనకై చేసిన ఆ పోరు రాష్ట్రాన్ని సాధించే వరకు తన తీరు మార్చుకోలేదు. ఉద్యమమేదైనా పునాది మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. ఇక్కడే రాష్ట్రం సిద్ధించి దశాబ్ధం కాలమవతుంది.
సమైక్య పాలనలో తెలంగా ణకు జరుగుతున్న అన్యా యాన్ని మొదటగా గుర్తిం చిన ఉస్మానియా విద్యార్థి లోకం ఉద్యమ బాట పట్టింది. స్థానికులకే సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వాలంటూ 1969 జనవరి 9న పాల్వంచలో అన్నా బత్తుల రవీంద్రనాథ్ చేసిన ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలిచింది.
అదే మొదటి అడుగుగా ప్రారంభమైన ఉద్యమం పల్లె పల్లెకు తెలంగాణ భావజా లాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు ఉస్మాని యా యూనివర్సిటీ విద్యార్థులు. ఈ ఉద్యమా నికి ఉద్యోగులు సైతం మద్దతు తెలపడంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది.
విద్యార్థుల ఉద్యమాన్ని పసిగట్టిన నాటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఉద్యమాన్ని అణచాలని విద్యార్థులపై కాల్పులపై జరిపి, నిర్బంధాన్ని విధించింది. ఫలితంగా 369 మంది విద్యార్థులు అమరు లయ్యారు. ఆ సమయంలో నిప్పుకనికల్లా మండుతున్న విద్యార్థి లోకంపై నాటి సర్కార్ నీళ్లు చల్లింది. కానీ వారిలోని పోరాట పటిమ ను, స్వరాష్ట్ర కాంక్షను మాత్రం చెరపలేకపోయింది.
1976 వరకు తెలగాణ ప్రాంతానికి మొత్తం ఉస్మా నియా విశ్వవిద్యాలయం ఒక్కటే ఉన్నత విద్యాసంస్థ. హైదరాబాద్ ఓయూ క్యాంపస్‌లోని కాలేజీలే కాకుండా కోఠిలోని మహిళా కాలేజీ, సైఫాబాద్ సైన్స్ కాలేజీ, సికింద్రాబాద్ కాలేజీ, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ దాని అనుబంధ కాలేజీలుగా ఉన్నాయి.
తెలంగాణలోని అఫిలి యేటెడ్ కాలేజీలు అన్నీ కూడా ఉస్మానియా విశ్య విద్యాలయం పరిధిలోకి వచ్చేవి. 1972 కంటే ముందు తెలంగాణ ప్రాంతంలో జరిగిన విద్యార్థి ఉద్యమాలన్నిటికీ కూడా ఉస్మానియా విశ్వవిద్యాల యమే సెంటర్ పాయింట్. ఆ కాలేజీలు ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ తొలి, మలి ఉద్యమాలకైతే గుండెకా యలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.