నారద వర్తమాన సమాచారం
జూన్ :01
మరణించిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్లు….
ఆధార్ తో పనిలేదు….
పాన్ కార్డు ఉంటే చాలు…
అది ఎలా సాధ్యం….
అమ్మిన వారిని కొనుకున్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత మీదే – సబ్ రిజిస్టర్ సమాధానం
శోకసంద్రంలో బాధితులు
సత్తెనపల్లి:
సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన మానుకొండ నరసింహారావు తండ్రి బంగారయ్య ఆస్తిని గోల్మాల్ చేసిన సబ్ రిజిస్టర్ ,కార్యాలయ సిబ్బంది,ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ మరియు మధ్య వ్యర్తులు.ఒకే పేరుతో ఉన్న డాక్యుమెంట్ కు నకిలీ పేర్లు సృష్టించి అక్రమంగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వైనం. 2019 సంవత్సరంలో మానుకొండ నరసింహారావు మరణించారు. అయితే 2022వ సంవత్సరంలో అదే మానుకొండ నరసింహారావు పేరుమీద సత్తెనపల్లి కెనరా బ్యాంకులో రుణం పొందినారు.1.54 ఎకరాల బ్యాంకు తనఖాలో వున్న మార్ట్గేజ్ డాక్యుమెంటును ఆధారం చేసుకొని రిజిస్ట్రేషన్ చేసిన సత్తెనపల్లి సబ్ రిజిస్టర్.దానికి సహకరించిన డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయ సిబ్బంది.మే నెల 16వ తారీఖున రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని మరుసటి రోజు 17న తెలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఆపమని ఫిర్యాదు చేసిన బాధితులు.24వ తారీఖు వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోని సత్తెనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది.అదేమని ప్రశ్నించిన బాధితులకి పొంతన లేని సమాధానం చెబుతున్న సబ్ రిజిస్టర్.ఎమ్మార్వో ఆఫీస్ కి కంప్లైంట్ ఇచ్చామని ఒకసారి, ఆధార్ అప్డేట్ కరెక్ట్ గా లేదని ఒకసారి చెబుతున్న సబ్ రిజిస్టర్.దీనిపై బాధితులు మీడియాతో మాట్లాడుతూ అసలు 1999లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మా తాతగారు ఒకసారి 50,000 ఒకసారి 30,000 రుణం పొంది ఉన్నారు ఇప్పటికి కూడ తీసుకున్న రుణం రద్దు అవ్వలేదు. ముఖం పొలం పై ఒక బ్యాంకు రుణం ఇవ్వగా ఆరుణం రద్దు కాని పక్షంలో ఇంకొక బ్యాంకు రుణం ఎలా మంజూరు చేశారు అర్థం కాని స్థితిలో ఉన్నాము. జిల్లా ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటరో వేచి చూడాల్సిందే…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.