నద వర్తమాన సమాచారం
ఆర్టీసీ బస్సుకు తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లా
:జూన్ 03
భీంపూర్ మండలంలోని అర్లి -ఇందూర్ పల్లి మార్గంలో ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రహదారి పక్కకు ఒరిగింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.
బస్సు ఆదిలాబాద్ నుంచి కరంజి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా బస్సు అదుపు తప్పిందని ప్రయాణీకులు తెలిపారు.
ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకు న్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.