నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ ,
04.6.2024.
ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా పల్నాడు జిల్లా అంతా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘాలో వున్నది ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు , శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే అటువంటి వారిని డ్రోన్ వీడియో,ఫోటోల ఆధారంగా గుర్తించి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా జిల్లా అంతటా 144 సెక్షన్ మరియు 30 పోలిసు యాక్ట్ అమలులో ఉన్నందున కౌంటింగ్ అనంతరం ఫలితాలు విడుదలైన తర్వాత ఎవ్వరు కూడా రోడ్లపై గుమికూడరాదు అలాకాక గుమికూడిన యెడల వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
దీనిని గమనించి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించవలసినదిగా కోరడమైనది-పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ మతి మలిక గర్గ్ ఐపీఎస్..