
నారద వర్తమాన సమాచారం
జూన్ :05
మూడోసారి ఎన్డీఏ సర్కార్.. ప్రపంచ దేశాల నుంచి ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ..
కేంద్రంలో ఎన్డీయే హ్యాట్రిక్ విజయం సాధించింది. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్న నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా.. అలాగే ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా మూడోసారి గెలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మంగళవారం అభినందనలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మంగళవారం అభినందనలు తెలిపారు.
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ సహా అనేక ఇతర ప్రపంచ నాయకులు పి ,ఎమ్, మోడీని అభినందించారు.
శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస కూడా నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
నేపాల్ ప్రధాన మంత్రి ‘ప్రచండ’ కూడా ప్రధాని మోదీని అభినందించారు.
మోదీ చారిత్రాత్మక విజయం సాధించినందుకు మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్‌నాథ్ అభినందనలు తెలిపారు.
మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జూ కూడా మోడీని అభినందించారు.
భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే కూడా చారిత్రాత్మక విజయం సాధించడంపై మోడీ – ఎన్‌డిఎకు అభినందనలు తెలిపారు.
బార్బోడోస్ ప్రధాని మియా అమోర్ మొట్టెలీ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.