
నారద వర్తమాన సమాచారం
జూన్ :06
చంద్రబాబును కలిసిన స్టాలిన్
తమిళనాడు సీఎం స్టాలిన్ టీడీపీ చీఫ్ చంద్రబాబును
కలిశారు.
‘ఢిల్లీ విమానాశ్రయంలో నా చిరకాల
మిత్రుడు చంద్రబాబును కలిశాను. తమిళనాడు,
ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాల బలోపేతం చేసేందుకు
ప్రయత్నిస్తాం. కేంద్రంలో ఆయన కీలకపాత్ర పోషిస్తారని
నాకు నమ్మకం ఉంది. దక్షిణాది రాష్ట్రాల కోసం
పోరాడుతూ మన హక్కులను కాపాడతారని
విశ్వసిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, ఇండియా
కూటమి సమావేశం కోసం స్టాలిన్ ఢిల్లీ వెళ్లారు.








