
నారద వర్తమాన సమాచారం
జూన్ :07
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కామెంట్స్
అంబెడ్కర్ ఆశయాలకు కట్టుబడి పనిచేసాను.2014 లో నాకు రాజకీయ అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు.
ఏపీ లో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గా పనిచేసేందుకు అవకాశం కల్పించిన చంద్రబాబు కు కృతజ్ఞతలు.జగన్ ఎస్పీ ఎస్టీ బీసీ మైనారిటీ లకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి వైసీపీ లో చేరాను.ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి ని తిరస్కరించారు.
ఈ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే నారా చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుంది.తెలుగు దేశం,జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారు.
మందా క్రిష్ణ మాదిగ నలబై ఏళ్లు గా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు.ఇప్పుడు ఆ అంశం ముగింపు కు వచ్చిందని భావిస్తున్నా.
నరేంద్ర మోడీ, చంద్రబాబు ఇద్దరూ వర్గీకరణ కు మద్దత్తు తెలిపారు.
అందుకే నేను వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.నా ఉద్యమాన్ని సామాజిక సేవను ముందుకు తీసుకు వెళతాను.
వర్గీకరణ అంశం నెరవేరే దాకా పనిచేస్తూ దానికి అనుకూలంగా ఉన్న పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తాను.








