నారద వర్తమాన సమాచారం
రూ. 84 కోట్ల భారీ నిధులతో రెండు ROBల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక చొరవ, నిరంతర కృషి ఫలితంగా.. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల ప్రజల దశాబ్దాల నాటి కల నెరవేరబోతోంది.
రైల్వే గేట్ల దగ్గర గంటల కొద్దీ ఆగిపోతూ ట్రాఫిక్ కష్టాలు పడుతున్న వాహనదారుల ఇబ్బందులను ఎంపీ . కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లి, పట్టుబట్టి రూ.84 కోట్ల భారీ నిధులను మంజూరు చేయించారు.
పెదకూరపాడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న గేటు (LC 27) స్థానంలో.. ఒకటి
సత్తెనపల్లి – రెడ్డిగూడెం మధ్యలో ఉన్న రైల్వే గేటు (LC 40) స్థానంలో.. మరొకటి
పై రెండు చోట్ల రైల్వే గేట్లను తీసేసి, వాటి స్థానంలో సరికొత్త 2-లేన్ల భారీ ఫ్లైఓవర్ (రైల్వే ఓవర్ బ్రిడ్జ్)లు కట్టడానికి రైల్వే శాఖ టెండర్లు విడుదల చేసింది!
ఈ రెండు భారీ బ్రిడ్జిల నిర్మాణ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాం! అత్యంత వేగంగా, కేవలం ఏడాదన్నరలోనే వీటి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇకపై ట్రైన్ వచ్చేటప్పుడు గేటు పడుతుందనే తిప్పలు ఉండవు. ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగనుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








