
నారద వర్తమాన సమాచారం
ప్రమాణ స్వీకారం తర్వాత పాలనలో మార్పు చూపించిన సీఎం చంద్రబాబు
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
జూన్ :13
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో సీఎం చంద్రబాబు మార్పు చూపించారని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. మాజీ సీఎం జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయవద్దని ఆదేశించినట్లు పేర్కొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భవనాలకు అప్పటి ప్రభుత్వం పార్టీ రంగులు వేయించిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భవనాలకు అప్పటి ప్రభుత్వం పార్టీ రంగులు వేయించి నానా హడావుడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చివరకి చంద్రబాబు పేరుతో ఉన్న శిలాఫలకాలను కూడా ధ్వంసం చేయించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ధనమున్న వారుకాదు.. దానం గుణం ఉన్న వారే ధనవంతులు : తంగిరాల సౌమ్య
ధనమున్నవారు కాదు.. దానం గుణం ఉన్న వారే ధనవంతులని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. తనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందించేందుకు తీసుకురాగా తంగిరాల సౌమ్య పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేసారు. కాగా, నియోజకవర్గంలో పలు గ్రామాలనుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు తంగిరాల సౌమ్యను కలసి శుభాకాంక్షలు తెలియజేసారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.