నారద వర్తమాన సమాచారం
జూన్ :14
జనసేన వీరమహిళ సామల సుజాత మృతి.
ఘనంగా నివాళులర్పించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు.
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి మున్సిపాలిటీ, ప్రతినిధి.
కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన జనసేన వీరమహిళ సామల సుజాత శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎన్డీఏ మహాకూటమి విజయం కోసం శక్తి వంచన లేకుండా పనిచేశారు. ఆమె అకస్మాత్తుగా మృతి చెందటంతో విషాదఛాయలు అలముకున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం హుటాహుటిన కొండపల్లి మున్సిపాలిటీలోని ఆమె నివాసానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. ఆమె పార్టీవదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చారు.
సామల సుజాత పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. ఆమె అకాల మరణం చెందటం చాలా బాధాకరమన్నారు. ఆమె మరణ వార్త తనను ఎంతో కలచివేసిందన్నారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), జనసేన నాయకులు చెరుకుమల్లి సురేష్ , జనసైనికులు, వీరమహిళలు, ఎన్డీఏ మహాకూటమి నాయకులు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.