నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్,
తేదీ.15.6.2024.
ముస్లిం సోదర, సోదరిమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు.
మత పెద్దలతో సమావేశమై మతసామరస్యాన్ని కాపాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి.
ప్రశాంత వాతావరణంలో సుఖ సంతోషాల నడుమ ముస్లిం సోదర సోదరీమణులు వారి కుటుంబ సభ్యులతో బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్ష .
జిల్లా ఎస్పీ మల్లీక గర్గ్ ఐపీఎస్
జూన్ 17వ తేదీన ముస్లిం సోదర,సోదరీమణులు బక్రీద్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండగ జరుపుకునే విధంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని దిశ నిర్దేశం చేశారు.
జిల్లా వ్యాప్తంగా గో సంరక్షణ చట్టం- 2017 అమలులో ఉంది. గోవులను ఒక చోట నుండి మరొక చోటుకు తరలించే క్రమంలో తగిన పత్రాలను కలిగి ఉండవలెను.
గోవులను వదించడం పూర్తిగా నిషిద్ధం. ఈ చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే, అట్టివారిపై చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
జిల్లా వ్యాప్తంగా సరిహద్దుల వద్ద అంతః రాష్ట్రా,అంతః జిల్లా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి గోవుల రవాణాపై నిరంతరం గట్టి నిఘా పెంచడం జరిగింది.
మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.
బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉంటే, ప్రజలు వెంటనే అప్రమత్తమై పల్నాడు జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 9440796184 కు సమాచారాన్ని అందించాలని జిల్లా ఎస్పీమల్లీక గర్గ్ ఐపీఎస్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయం,
పల్నాడు జిల్లా.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.