నారద వర్తమాన సమాచారం
అర్బన్ బ్యాంక్ అభివృద్ధి కోసం మరింత కృషి:
అర్బన్ బ్యాంక్ ప్రస్తుత చైర్మన్
కర్నాటి వెంకట బాలసుబ్రమణ్యం
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
గతంలో అర్బన్ బ్యాంక్ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన నేపథ్యంలో మరోసారి అవకాశం ఇస్తే అర్బన్ బ్యాంకు ను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరచడానికి సిద్ధంగా ఉన్నానని ప్రస్తుత చైర్మన్ కర్నాటి వెంకట బాలసుబ్రమణ్యం అన్నారు. పురపాలక కేంద్రంలో సోమవారం నిర్వహించిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కండేయ స్వామి దేవాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం వెంకటరమణ కాలనీ, సాయినగర్ కాలనీలో ప్రచార కార్యక్రమాలు తన పానల్ సభ్యులతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఓటర్ని కలిసి మరొకసారి అవకాశం కల్పించాలని ఆయన ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పానల్ సభ్యులు గుండు కావ్య మధు, చిక్క కృష్ణ, ఏలే సుధాకర్, కుడికాల బలరాం, పోవనపు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.