నారద వర్తమాన సమాచారం
తెలంగాణ
:జూన్ 26
తెలంగాణ లో త్వరలోఆర్టీసీ డిజిటల్లోకి అడుగుపెట్ట బోతోంది. ఆర్టీసీ బస్సుల్లో ఇక నుంచి చిల్లర కోసం తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు.
ఎందుకంటే మరికొన్ని రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ సేవలను అందుబా టులోకి తీసుకువచ్చేందుకు ప్రక్రియను స్పీడప్ చేసింది. ఆర్టీసీ.
ఆర్టీసీ బస్సుల్లోనూ గూగుల్ పే, ఫోన్ పే, డెబిట్, క్రెడిట్, పేటీఎం వంటి స్వైపింగ్ పేమెంట్స్ విధానాలతో టికెట్లను జారీ చేయను న్నారు.
సాధారణంగా బస్సు టికెట్ల జారీలో చిల్లర భయం ఉంటుంది. ఈ విషయంలో కండక్టర్లు నానా తిప్పలు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ చెల్లింపులను ప్రోత్సహించి టికెట్ జారీ చేయడానికి గ్రేటర్ ఆర్టీసీ అధికారులు కసరత్తు షురూ చేశారు.
కేసీఆర్‌కు మరోసారి పవర్ కమిషన్ లేఖ దీనిలో భాగంగానే బండ్లగూడ డిపోను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 70 బస్సుల్లో టికెట్ జారీ పరికరాలను కండక్టర్లకు అందించారు. 20 రోజుల నుంచి డిజిటల్ చెల్లింపులతోనే టికెట్లు ఇస్తున్నారు. ఆ యంత్రాల పనితీరులో ఏమైనా లోపాలు ఉన్నా.ఎంత సమయంలోపు పేమెంట్ అవుతోంది..స్కాన్ చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా వంటి టెక్నికల్ ఇష్యూస్ పై ఆర్టీసీ స్టడీ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు. దీంతో నగర వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను తీసుకురాబోతోంది ఆర్టీసీ…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.