నారద వర్తమాన సమాచారం
డిల్లి.
దిల్లీ, ముంబయి మధ్య నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వే 1,350 కి.మీ పొడవుతో ఎనిమిది వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా గుర్తింపు పొందింది.
ఈ సూపర్ ఎక్స్‌ప్రెస్ వేను అమృత్‌సర్, జామ్‌నగర్ నగరాల మధ్య కేంద్రం నిర్మిస్తోంది. ఎడారి మీదుగా నిర్మితమవుతున్న మార్గాన్ని 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ ఏ ఐ ) లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్ వరకు 1,316 కి.మీ. మేర నిర్మంచనున్నారు. ఇది వాడుకలోకి వస్తే ఈ నగరాల మధ్య ప్రయాణ దూరం, ఖర్చులు తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే రాజస్థాన్ మీదుగా వందల కిలోమీటర్ల ఎడారిని దాటుతూ పలు పారిశ్రామికవాడలను కలుపుతుంది. దీని వల్ల రాష్ట్రాల మధ్య అనుసంధానం, ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయి.
అమృత్‌సర్ నుంచి జామ్‌నగర్ చేరుకోవడానికి ప్రస్తుతం 1,516 కి.మీ.దూరం ప్రయాణించాలి. దీనికి దాదాపు 26 గంటల సమయం పడుతుంది. కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో ఈ నగరాల మధ్య దూరం 216 కి.మీ తగ్గుతుంది. 13 గంటల్లో గమ్యస్థానాలను చేరుకోవచ్చు. అమృత్‌సర్-జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల దిల్లీ ప్రజలకూ ప్రయోజనం ఉంటుంది. ఈ రోడ్డు పంజాబ్, దిల్లీ, రాజస్థాన్, హరియాణాలను నేరుగా అనుసంధానిస్తుంది. గుజరాత్ నుంచి కాశ్మీర్‌కు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. అమృత్‌సర్, భటిండా, మోగా, హనుమాన్‌గఢ్, సూరత్‌గఢ్, బికనేర్, నాగౌర్, జోధ్‌పూర్, బాడ్మేర్ ప్రాంతాల మీదుగా వెళ్లనుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.