నారద వర్తమాన సమాచారం
జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేయండి అని కేంద్రమంత్రి గడ్కారీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
కేంద్ర మంత్రి గడ్కారీ దృష్టికి తీసుకెళ్ళిన ఇతర అంశాలు
మూడు రాష్ట్రాలను అనుసంధానం చేసే జాతీయ రహదారులు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్
వనపర్తి నుంచి మంత్రాలయము
ఎర్రవల్లి చౌరస్తా నుంచి రాయచూర్ రహదారులపై ప్రతిపాదనలు పంపినందుకు
సీఎం రేవంత్ రెడ్డి కి బండ్ల చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు
జోగులాంబ గద్వాల జిల్లా:
జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేయండి అని జాతీయ రహదారుల శాఖ కేంద్ర మంత్రి గడ్కారీ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు లు కలిసి జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేయాలని కోరిన విషయం విధితమే. అయితే ఇదే సందర్భంలో మూడు రాష్ట్రాలను అనుసంధానం చేసే జాతీయ రహదారులు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ మీదుగా వెళ్లే జాతీయ రహదారులకు కూడా నిధులు మంజూరు చేయాలని కోరిన సందర్భంలో వనపర్తి నుంచి మంత్రాలయం, ఎర్రవల్లి నుంచి రాయిచూర్ ఈ రెండు రోడ్ల నుంచి మనకు మూడు రాష్ట్రాలు అనుసంధానం అవుతుందని ఈ రోడ్లన్నీ నేషనల్ హైవే లు గా (4 లైన్స్) గుర్తించాలని కేంద్ర మంత్రి గడ్కారీ కి కోరిన సందర్భంలో ఈ జాతీయ రహదారులు పనులు ప్రారంభం అయితే జోగులాంబ గద్వాల జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతంలోని రైతులకు పంటలు, మరియు వాణిజ్య పంటలు మరింత అభివృద్ధి అవుతున్నాయని, మూడు రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ జాతీయ రహదారులు రావడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతంలో వివిధ రకాల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, మరియు రైతులు పండించిన పంటల కొరకు వాణిజ్య సంపద ఇండస్ట్రియల్ కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, జోగులాంబ గద్వాల జిల్లా ఈ ప్రాంతం అంతా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని, ఇతర రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతంలో కంపెనీలు నెలకొల్పేందుకు రవాణా సౌకర్యం కూడా సులువుగా ఉంటుందని, ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబులకు జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.