పోషకాహారం తోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం
దేశముఖి అంగన్వాడీ సెంటర్లో పిల్లలని బరువు తూగుతున్న అంగన్వాడి కార్యకర్తలు
నారద వర్తమాన సమాచారం
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
మండలం పట్టణ వ్యాప్తంగా శనివారం అంగన్వాడీ సెంటర్లలో అప్పుడే పుట్టిన పిల్లల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ బరువు తూచే ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పిల్లలందరినీ కొలతలు నిర్వహించి వారికి సర్టిఫికెట్లను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సూపర్వైజర్స్ శ్రీదేవి, పద్మ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు సరైన పోషకాహారాన్ని అందించడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని వారు అన్నారు. ముఖ్యంగా గర్భిణీ సమయంలో మహిళలు సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారానే పిల్లల ఎదుగుదల అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు జంగమ్మ, శోభ, రుక్మిణి, వసంతం, ఉమారాణి, మంగ, వసంత, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.