నారద వర్తమాన సమాచారం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భారత అంధుల క్రికెట్ టీం
తెలంగాణ
జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్ప బలం మనలో ఉండటం ప్రధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న సిఎం న్యూయార్క్ నగరం లో భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను నిన్న సాయంత్రంకలుసుకున్నారు.
వారిని కలుసుకున్న సంద ర్భం తనకు లభించిన ఒక అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. వారితో ఆప్యాయంగా కొద్దిసేపు ముచ్చటించారు.
జీవితంలో ఎలాంటి సవాళ్ల యినా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని వారి నుంచి నేర్చు కోగలమన్నారు. వారిలోని స్పూర్తిని అభినందిస్తూ వారికి ముఖ్యమంత్రి శుభా కాంక్షలు తెలియజేశారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








