నారద వర్తమాన సమాచారం
ఓ మహిళ కానిస్టేబుల్ దౌర్జన్యం…
ఎల్ బీ నగర్
ఆగస్టు
ఎల్ బీ నగర్ వనస్తలిపురం కమల్ నగర్ రోడ్డు నెంబర్ 8లో ఉన్న తమ చిన్న కుమారుడు నీల సాయి కృష్ణ పేరుతో ఉన్న 150 గజాల ఇల్లును మా కుటుంబ ఆర్ధిక పరిస్థితుల కారణంగా అమ్ముకోవడం జరిగిందని, తమ ఇంట్లో గత కొంత కాలంగా ఉంటున్న మా చిన్నమ్మ కూతురు రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న యు. రాజేశ్వరి కానిస్టేబుల్ ని పలు మార్లు ఇల్లు కాళీ చేయాలనీ కోరినా కానీ కాలిచేయకపోగా మాపై దాడులు చేయడమే కాకుండా స్తానిక పోలీస్ స్టేషన్ లో అక్రమంగా తమపై అక్రమ కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, నాకు ఉన్నత అధికారుల మద్దతు ఉంది నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు పాల్పడుతుందని బాధితులు కావాలి నిర్మల, భర్త రాములు ఆవేదన వ్యక్తం చేశారు.బాధిత కుటుంబం సోమవారం ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ తాము తమ ఇంటిలో ఉంటున్న కానిస్టేబుల్ రాజేశ్వరి తమ ఇంట్లో ఉంటూ కాళీ చేయకపోగా తమపైనే దాడులకు పాల్పడుతూ, బెదిరింపులతో తీవ్ర ఇబ్బందులు పెడుతుందని స్తానిక పోలిసస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా కానీ పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు ఒక న్యాయం అధికారులకు ఒక న్యాయమా బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగం లో ఉండి తమ ఇల్లును కబ్జా చేయాడానికి ప్రయత్నం చేయడం ఎంత వరకు సమం జసన్నారు. చేతిలో అధికారం పై అధికారుల అండదండలు ఉంటే ఏదైనా చేయవచ్చా అని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసుల వద్ద మోరపెట్టుకున్నా కానీ రాజేశ్వరి పై కేసు పెడితే కేసు కూడా నమోదు చేయడం లేదని తెలిపారు. ఇప్పటి కైనా పై అధికారులు తక్షణమే స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని, లేనిచో తమకు చావే శరణ్యమని తమ గోడును వెళ్ళబోసుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.