నారద వర్తమాన సమాచారం
ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రజా కళావేదిక పోస్టర్ ఆవిష్కరణ.
అక్టోబర్. (10/10.24). తిరుపతి
తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసుల చేతుల మీదుగా గురువారం నూతనంగా ఏర్పాటైన ప్రజా కళావేదిక పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా కళావేదిక చైర్మన్ అరవ జయపాల్ ను అభినందిస్తూ మీ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. అలాగే ప్రజలకు అందుబాటులోకి ఉండే విధంగా కార్యక్రమాలు ఉండాలని ఆశీర్వదించారు. మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రజా కళావేదికను ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం గొప్పగా నెరవేరాలని ఆశిస్తున్నానని అన్నారు. ఇదే సమయంలో అందరి మన్ననలను పొందాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా కళావేదిక చేర్మెన్ అరవ జైపాల్ మాట్లాడుతూ ఈ ప్రజా కళావేదిక ద్వారా కవులు కళాకారులనే కాక, తెలుగు భాష అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని హై స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు తెలుగు భాష పై పలు రకాల వ్యాసాలతో పాటు పలురకాల సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పిల్లలకు అవగాహన కల్పించే విధంగా ఉంటుందని తెలిపారు. పలు విధాలైన సేవా కార్యక్రమాలతో ప్రజలకు మేలు చేకూర్చాలని సంకల్పంతో ప్రజా కళావేదిక ఏర్పాటు అయిందన్నారు . పోస్టర్ ఆవిష్కరణకు సంహరించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









