నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల
మేజర్ కాలువలు మరమ్మతులు, ఆధునికీకరణలో భాగంగా పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామం ఆంజనేయ స్వామి గుడి వద్ద వున్న ఆకురాజుపల్లి మేజర్ కాలువ వద్ద పనులు ప్రారంభించిన సందర్భంగా పూజా కార్యక్రమాల్లో నరసరావుపేట పార్లమెంటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొనటం జరిగింది. ఆకురాజుపల్లి మేజర్ ఆయకట్టు 21.726 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ ఆయకట్టు ద్వారా 24,984 ఎకరాల సాగు భూమికి నీరు అందించడం జరుగుతుంది. నరసరావుపేట పార్లమెంటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి జేసీబీతో పూడిక తీత, గుర్రపుడెక్క మరియు పిచ్చి మొక్కలను తొలగించి మేజర్ కాలువల ఆధునీకరణ పనులను ప్రారంభించడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొనటం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ E.E వై. శ్రీహరి D.E.E మురళిధర్ వ్యవసాయ ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆకురాజుపల్లి మేజర్ కాలువ పరిధిలోని రైతులు, రైతు సంఘాల నాయకులు మరియు పిడుగురాళ్ల పట్టణం, మండలంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలలోని రాష్ట్ర, పార్లమెంటు, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








