నారద వర్తమాన సమాచారం
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం లో 62 మంది మృతి?
దక్షిణ కొరియా
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా తమ కథనాల్లో వెల్లడించింది.
ముయూన్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై విమానం (7c2216) అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో విమానం పేలిపో యింది. ఘటనాస్థలంలో రెస్య్కూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
బ్యాంకాక్ నుంచి ముయూ న్కు వస్తుండగా దుర్ఘటన జరిగింది. ప్రమాద సమ యంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 181 మంది ఉన్నారు.
అయితే మృతుల సంఖ్య మరింతే పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలి యాల్సి ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.