నారద వర్తమాన సమాచారం
పల్నాడులో ఎలాంటి భూ వివాదాలకు తవు లేకుండా రైతుల సమక్షంలోనే రీసర్వే — కలెక్టర్ పి అరుణ్ బాబు
పల్నాడుఎలాంటి భూ వివాదాలకు తావులేకుండా రైతుల సమక్షంలోనే రీసర్వే చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. సంబంధిత రైతుతోపాటు, చుట్టుప్రక్కల రైతులను కూడా పిలవాలని సూచించారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడు గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. సంబంధిత భూముల రికార్డులను పరిశీలించారు. సర్వే నంబర్ల ఆధారంగా రైతువారీగా భూ విస్తీర్ణం పై ఆరా తీశారు. గ్రామంలోని భూముల వివరాలను సమగ్రంగా తమకు అందజేయాలని, రీ సర్వే ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వెబ్ ల్యాండ్ రికార్డుల ప్రకారం రీ సర్వే ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. అనంతర0 తహసీల్దార్ కార్యాలయం లో రీసర్వే జరుగుతున్న పనిని పరిశీలించారు.ఈ పర్యటనలో సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి రమణకాంత్ రెడ్డి, తహసీల్దార్ ,ఇతర సర్వే, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.