నారద వర్తమాన సమాచారం
ఐఏఎస్ లోతేటి శివశంకర్ కు భారీ ఊరట
తెలంగాణ:ఎట్టకేలకు ఐఏఎస్ లోతేటి శివశంకర్ కు భారీ ఊరట లభించింది. శివశంకర్ ను వెంటనే ఏపీకి కేటాయించాలని క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.అలాగే నాలుగు వారాల్లో ఏపీ క్యాడర్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని DOPT కి క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ క్యాడర్ విభజనలో భాగంగా తనను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని శివశంకర్ లోతేటి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే.








