నారద వర్తమాన సమాచారం
పి. జి.ఆర్ ఎస్ ఫిర్యాదుల పరిష్కారం పై రివ్యూ నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఏఎస్…
నరసరావుపేట
జిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన VC లో PGRS ఫిర్యాదుల పరిష్కరం పై రివ్యూ నిర్వచించారు. జిల్లాలో PGRS పిర్యాదులు పరిస్కారం లో జిల్లా మండల స్థాయి అధికారులు శ్రద్ద వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పిర్యాదు ఎక్కడి నుండి వచ్చినదీ పరిశీలించి, పరిష్కరించాలని తెలిపారు. నేరుగా ముఖ్యమంత్రి వారికీ ఇచ్చివారి endorsement ఉన్న ఫిర్యాదుల విషయం లో సంబంధిత అధికారులు విచారణ చేసి నివేదిక కలెక్టర్ వారికీ లేదా పొలిసు శాఖ సంబంధించి అయితే SP వారికీ సమర్పించాలి. సంబంధిత పిర్యాదుదారుతో కలెక్టర్ /SP వారు నేరుగా మాట్లాడి పరిష్కరించదగినదా లేదా అనేది చూడడం జరుగుతుంది. ఏ పిర్యాదు reopen కాకూడదని, ఫిర్యాదుదారు తో అధికారి మాట్లాడాలని , అదేవిధంగా నివేదిక ను వారికీ ఇవ్వాలని తెలిపారు, PGRS విషయం లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వారికీ ఇచ్చి వారి endorsement ఉన్న ఫిర్యాదుల విషయం లో తప్ప మిగిలిన అన్ని పిర్యాదులు సంబంధిత అధికారి క్లోజ్ చేయవచ్చని తెలిపారు, అన్ని PGRS పిర్యాదులపైనా 4 స్థాయిలలో ఆడిట్ నిర్వహిస్తారని, పిర్యాదు దారు తో మాట్లాడకపోయినా, నివేదిక వారికీ ఇవ్వక పోయినా, తప్పు ఎండార్స్మెంట్ ఇచ్చినా ఆడిట్ లో REOPEN చేయడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి వారికీ ఇచ్చి వారి endorsement ఉన్న ఫిర్యాదుదారులు ఇంకొల్లు కు చెందిన గంటా సుబ్బారావు తో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. పిర్యాదు దారు చెప్పిన అంశములపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో RIVEW నిర్వహించి రికార్డులు వెరిఫికేషన్ కొరకు 10వ తేదీ సమయం ఇచ్చారు. మరొక పిర్యాదుదారు అచంపేట మండలం నిందుజెర్ల గ్రామానికి చెందిన పి . నాగరత్తమ్మ తో కూడా ఫోన్ లో మాట్లాడి పిర్యాదు అంశములను చర్చించారు. ఫిర్యాదుపై పోలీసు వారికి సూచనలు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.