Saturday, June 14, 2025

కూనవరం మేజర్ పంచాయతీ మీద విషం చిమ్ముతున్నారు సర్పంచ్ మల్లంపల్లి హేమంత్…

నారద వర్తమాన సమాచారం

కావాలనే కొంతమంది మా కూనవరం మేజర్ పంచాయతీ మీద విషం చిమ్ముతున్నారు

కూనవరం సర్పంచ్ మల్లంపల్లి హేమంత్

మేజర్ పంచాయతీలో జరుగుతున్న పనులు అభివృద్ధిని ఓర్వలేని వాళ్లు చేసిన పని

15 సంవత్సరాలుగా ఉన్న నీటి సమస్యను తీర్చినటువంటి ఘనత నాది

పత్రికా సోదరులు ఎవరైనా వార్త రాసేముందు నా దగ్గరకు వచ్చి వివరణ తీసుకోవాల్సింది.

కూనవరం :

గత కొన్ని రోజులుగా కూనవరం పంచాయతీ మీద వస్తున్న వార్తా కథనాలు , పూర్తిగా అవాస్తవం. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీ అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తుంటే చూసి ఓర్వలేని వాళ్ళు చేసే పని. అని కూనవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ మల్లంపల్లి హేమంత్ గాంధీ అన్నారు. శబరి గోదావరి సంఘమ ప్రాంతంలో ఉన్న కూనవరం ప్రతి సంవత్సరం వచ్చే వరద ఎన్నిసార్లు వస్తుందో తెలుసు, ప్రతిసారి వచ్చే వరదకు ఎన్నిసార్లు పారిశుద్ధ్యం చేపించ వలసిన అవసరం ఉంటుందో కూనవరం ప్రజానీకానికి తెలుసు. 2022లో గోదావరి వరదలు వచ్చి కూనవరం టేకులబోరు ప్రాంతమంతా పూర్తిగా బురదమయం అయిపోయింది. అలా ప్రతిసారి అనేకమార్లు వరద వచ్చింది. ఎన్నిసార్లు మోటర్లు కాలిపోయాయి. ఎన్నిసార్లు వరద రావడం శుభ్రం చేయడం మళ్లీ వరదరావడం అందరికీ తెలియనిది కాదు. నేను సర్పంచ్ గా ఉన్న సమయంలోనే రుద్రం కోట కూనవరం పడవ రేవు పాట అధికంగా పోగలిగింది. ఆ అధికంగా పోయిన మొత్తం ఒక కూనవరానికి మాత్రమే కాదు రుద్రం కోటకి సగం కూనవరానికి సగం రెండు ఊర్లకు సంబంధించిన పడవ రేవు పాట కూనవరానికి మాత్రమే వర్తిస్తుందని వార్త కథనాల్లో ప్రచురించడం తప్పు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూనవరం వచ్చినప్పుడు పారిశుద్ధ్యనికి అయిన ఖర్చు, ఆ తర్వాత వచ్చిన గోదావరి లకు అయిన ఖర్చు పంచాయతీ నుండి తీసినదే. ఎటువంటి విపత్తు నిధులు రాలేదు. ఇక 14,15 ఆర్థిక సంఘం నిధుల నుండి 30 లక్షల రూపాయలు పాత కరెంట్ బిల్లు బకాయిలు అప్పటి గవర్నమెంటు తీసుకుంది. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ లెక్క ఉంది తప్ప ఇక్కడ ఎటువంటి దోపిడీ జరగలేదు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఆర్టిఏ వేసిన పై అధికారులు ధ్రువీకరించారు. పంచాయితీ ఆర్ అండ్ ఆర్ గ్రామ సభలకు అయ్యే ఖర్చు కూడా భరించాము. పంచాయతీ గురించి ఎవరికైనా పత్రికా సోదరులకు అనుమానం ఉంటే ముందు మమ్మల్ని సంప్రదించి అడిగి తెలుసుకుని రాయాలి తప్ప తెలుసుకోకుండా రాసి ఇబ్బంది పెట్టకూడదు. నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఫాలో అవుతాను. తప్పు చేయను. నాది తప్పు అని నిరూపిస్తే ఏం చేయడానికి అయినా సిద్ధపడతాను అని ఆయన అన్నారు. కొంతమంది కావాలనే కూటమి ప్రభుత్వం పై విషం చిమ్ముతున్నారు. ఈ విషయంపై మా పై నాయకుల దగ్గర ప్రస్తావించాం. కచ్చితంగా వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. ఈ ఏజెన్సీ ఏరియాలో నాన్ ట్రైబ్ కి సర్పంచ్ గా అవకాశం వచ్చినందున, వచ్చిన అవకాశాన్ని అభివృద్ధి వైపు మేము మలుచుతున్నందున, చూసి ఓర్వలేని వారు చేసిన పని. ఇకమీదట అభివృద్ధి పనులు అన్ని జరుగుతాయి. ఎవరైనా లెక్కలు కావాలంటే సర్పంచ్ గా నా దగ్గరకు రండి! అని కూనవరం సర్పంచ్ మల్లంపల్లి హేమంత్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading