నారద వర్తమాన సమాచారం
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కేసులో దాచేపల్లి పంచాయతీ సంక్షేమ కార్యదర్శిని అరెస్ట్ చేసిన దాచేపల్లి పోలీసులు
దాచేపల్లి పట్టణ పంచాయతీ సంక్షేమ కార్యదర్శి సాంపతి లక్ష్మీ ప్రసాద్‌ను ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో దాచేపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
28.02.2025న రూ. 34,18,000/- బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసిన నిందితుడు, రూ. 11,12,500/- మాయం చేసి పరారయ్యాడు. 01.03.2025న కార్యాలయానికి హాజరు కాలేదు మరియు ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశాడు.
నేడు దాచేపల్లి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని దాచేపల్లి సీఐ P. భాస్కర్ ఎస్‌ఐ పాపారావు వెల్లడించారు.