నారద వర్తమాన సమాచారం
స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతం
అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన విషయం తెలిసిందే. భవిష్యత్లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఈ కీలక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టిన ఇస్రో ఆదిశగా మరో అడుగు వేసింది. తాజాగా స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతం గా నిర్వహించింది. దీనిపై సంస్థకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు.








