Thursday, June 12, 2025

శ్రీ నరసింహ స్వామి స్వయంభు గా వెలసిన క్షేత్రాలు

నారద వర్తమాన సమాచారం

శ్రీ నరసింహ స్వామి స్వయంభు గా వెలసిన క్షేత్రాలు

నరసింహ అవతారం.. దశావతారాల్లో ఒక్కో అవతారం ఒక్కో విశేషం. అందులో మన తెలుగునేలకు అత్యంత దగ్గరైన అవతారం శ్రీ నారసింహావతారం. ఆయా సందర్భాలలో ఆయా క్షేత్రాలలో స్వామి స్వయంభూగా వెలిశారని ప్రతీతి. ఆ నవక్షేత్రాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం…

1)ఆహోబిలం:

నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైన అహోబిల నరసింహ స్వామి దేవాలయం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కి మీ దూరం లో ఉంది . నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశాపుని చీల్చి చెండాడిన క్షెత్రమిదెనని స్థల పురాణం చెబుతుంది . హిరణ్యకశాపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం ,అహో ..బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం గా పేరు వచ్చింది అని చెబుతారు .

బ్రహ్మాండ పురాణం లో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది . శ్రీ మహావిష్ణువు ఉగ్రనారసింహ అవతారం లో స్థంబం నుంచి ఉద్బవిన్చినట్లు చెప్పే స్థంబాన్ని కూడా అహోబిలం లో చూడవచ్చు . దిగువ అహోబిలం లక్ష్మి నరసింహ స్వామి శాంతి మూర్తి అయి వెలసిన క్షేత్రం, కొండ పైన ఎగువ అహోబిల నరసింహుని చుడవొచ్చు . హిరణ్య కసపుడిని సంవరించి అహోబిలమ కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి . (1) భార్గవ నరసింహ స్వామి (2) యోగానంద నరసింహ స్వామి (3) చత్రపట నరసింహ స్వామి (4) ఉగ్ర నరసింహ స్వామి (5) వరాహ నరసింహ స్వామి (6) మాలాల నరసింహ స్వామి (7) జ్వాల నరసింహ స్వామి (8) పావన నరసింహ స్వామి (9) కారంజ నరసింహ స్వామి నవ నరసింహ క్షేత్రాలు ఇక్కడ ఫాల్గుణ మాసం లో ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి .

2)యాదాద్రి:

నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహ స్వామి కి ఘనమైన చరిత్ర ఉంది . పూర్వం ఋష్య శ్రున్గుని కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహా విష్ణ్వు ప్రత్యక్షమవ్వగా తనకు నరసింహస్వామిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసిమ్హుండు,యోగానంద నరసిమ్హుండు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట . స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.ఇప్పుడు ఈ ప్రదేశాన్ని తొలచి ఇంకా విశాలంగా తిర్చిదిద్దరట. లోనికి దిగేముందు పంచముఖ ఆంజనేయ స్వామి కోవెల ఉంది . ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ పై గండబేరుండ నరసింహమూర్తి ఉంది గర్బ గుడి లో జ్వాల నరసింహ,యోగానంద నరసింహ మూర్తులు ఉన్నాయి . కొండపైన స్వామి వారి పుష్కరాని కూడా ఉంది . ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు, రోగాలు నయమయిపోతాయని భక్తుల నమ్మకం.

3)మాల్యాద్రి లక్ష్మీనారసింహస్వామి:

అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపమాచరించగా లక్ష్మి నారసింహుడు జ్వాల రూపుడై దర్శనమిన్చ్చాదని ,జ్వాల నరసిమున్హి గ కొండ పైన వెలిసారు అని పురాణం గాథ . మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కందుకూరు – పామూరు రోడ్డు లో వలేటివారిపాలెం మండల పరిధి లోని ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారం లో ఉండటం తో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు వచ్చాయి. ప్రకృతి శోభకు నిలయమైన మాలకొండ ఏకశిలా నిర్మితం కావడం విశేషం . జ్వాల నరసింహుని పూజించిన మార్కండేయ ముని సమీపం లోని యేరులో స్నానం ఆచరించారని అదే మార్కండేయ నది అని చెబుతారు.

4)సింహాద్రి:

విశాఖపట్టణానికి 16 కి మీ దూరం లో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున గల కొండ పైన వెలసిన నరసింహ క్షేత్రం ఇది . నవ నరసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి . ఈ దేవాలయాన్ని సుమారు 9 వ శతాబ్దంలో నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి . గర్భాలయం లో స్వామీ వారు వరాహ ముఖం , మానవాకారం , సింహపు తోక కలిగి ఉంటారు . వరాహ -నరసింహ మూర్తుల సమ్మేళనం లో వెలసిన ఈ స్వామి ని సింహాద్రి అని పిలుస్తారు . ఈ గుడి ముఖ మండపం లో ఒక స్తంభం ఉంది. దానిని కౌగిలించుకొని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నేరువేరుతాయని భక్తుల విశ్వాసం. అద్బుతమైన శిల్ప సంపద, అందమైన చెక్కడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి . వరాహ పుష్కరిణి కొండ క్రింద ఆడవి వరం గ్రామం లో ఉంది . ప్రతి సంవత్సరం పుష్యమాసం లో స్వామి వారు తన దేవేరుల సమేతంగా కొండ దిగి వచ్చి పుష్కరిని లో ఉన్న భైరవ స్వామి ని దర్శించి అనంతరం కొండ కి చేరి స్వామిని దర్శనం చేసుకోవాలని చరిత్ర చెబుతుంది .

5)ధర్మపురి లక్ష్మీ నారసింహస్వామి:

ధర్మపురి కి పొతే యమపురి ఉండదు అని చెబుతుంటారు. ప్రసిద్ది గాంచిన నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కరీంనగర్ పట్టణ కేంద్రానికి 75 కి మీ దూరం లో ఉంది . పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం.ఇక్కడ స్వామి వారు యోగానంద నరసింహ స్వామి గ భక్తుల కోర్కెలు నేరవేరుస్తున్నాడు. యమలోకం లో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి లో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం నివాసం ఎర్పర్చుకున్నట్లు పురాణం గాథలు చెబుతున్నాయి . ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది . యమ ధర్మరాజు ని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవాయితి . పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గం లో నడిపించి నాలుగు పాదముల ధర్మం తో ఈ క్షేత్రాన్ని పరిపలించినందుకు ధర్మపురి అని పేరు వచ్చింది అని పురాణాలూ పేర్కొంటున్నాయి.

6)వేదాద్రి క్రిష్ణా యోగా నారసింహస్వామి:

నవ నరసింహ క్షేత్రాలల లో ఒకటైన నరసింహ క్షేత్రం కృష్ణ నది ఒడ్డున చిలకల్లు కి 10 కి మీ దూరం లో విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారి లో ఉంది . ఈ క్షేత్రం లో నరసింహ స్వామి వారు 5 అవతారాల్లో కనిపిస్తాడు . జ్వాల నరసింహ స్వామి, సలిగ్రంహ నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి , లక్ష్మి నరసింహ స్వామి , వీర నరసింహ స్వామి అవతారాల్లో దర్శనమిస్తారు . అద్బుతమైన కట్టడాలు,యోగముద్రలో ఉన్న నరసింహ స్వామి వారు భక్తులకు కనువిందు చేస్తారు . ఇక్కడ జరిగే స్వామి వారి ఉత్సవాలు ఎంతో రమణీయంగా కనుల పండుగగా జరుగుతాయి.

7)అంతర్వేది:

పరవళ్ళు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేది చేరుకోవొచ్చు. చాల పురాతనమైన ఆలయం లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వెలసిన ఎంతో మహిమన్వితమైన క్షేత్రం . త్రేతా యుగం లో రావణ బ్రహ్మ ను సంహరించి శ్రీ రాముడు బ్రహ్మ హత్య పాతకం నుంచి విముక్తి ని పొందడానికి ఈ క్షేత్రాన్ని ధర్సించాడని పురాణాలూ చెబుతున్నాయి . అలాగే ద్వాపర యుగం లో అర్జనుడు తీర్థ్ యాత్రకు వెళ్తూ ఆగిన తీర్థం అంతర్వేది . మాఘమాసం లో స్వామి వారికి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగ గా జరుగుతాయి .

8)మంగళగిరి పానకాల స్వామి:

నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహ స్వామి దేవాలయం,గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది .చాల పురాతనమైన దేవాలయం .. కొండ మీద వెలసిన పానకాల నరసింహ స్వామి ఎంత పాత్రతో పానకం పోసిన అందులో సగం త్రాగి సగం వేలకి క్రక్కటం జరుగుతుంది . కొండ గిగువన లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఉంది . దీని ముందు ఎత్తైన గాలి గోపురం ఉంటుంది .

9)పెంచలకోన నారసింహస్వామి:

నెల్లూరు జిల్లా లోని రాపూర్ మండల కేంద్రం లో గల పెంచల కోన క్షేత్రం లో లక్ష్మి నరసింహ స్వామి స్వయంభూవుగా వెలసిన క్షేత్రం. నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటి ఆయన పెంచలకోన లో స్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై స్వయంభు గా వెలసి ఉన్నాడు. భక్తుల పాలిట ఇలవేల్పు అయి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంమయాడు . హిరణ్యకస్యపున్ని సంహరించి మహౌగ్ర రూపంతో వెళ్తుంటే దేవతలు అందరు భయపడిపోయారు . అల శేషచల కొండల్లో సంచరిస్తుండగా ఆయనకు చెంచు రాజు కుమార్తె ఆయన చెంచు లక్ష్మి కనిపించింది . ఆమె జగన్మోహన సౌందర్యం స్వామిని శాంతింప చేసింది . ఆ తరువాత ఆమెని వివాహం చేసుకొని పెంచలకోన ప్రాంతం లో వెలిసాడు అని స్థల పురాణం చెబుతుంది.

సర్వేజనా సుఖినోభవంతు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading