నారద వర్తమాన సమాచారం
నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ఎస్ ఆర్ కె టి నందు కార్డెన్ సెర్చ్ …
ఈ రోజు తెల్లవారుజామున పల్నాడు జిల్లా ఎస్పీకంచి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి
ఎస్ ఆర్ కె టి నందు కార్డెన్ & సెర్చ్ నిర్వహించిన పోలీసులు...
నరసరావుపేట డి.ఎస్.పి అయిన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 సిఐ లు,14 మంది ఎస్సైలు, పోలీసు సిబ్బంది మరియు ఏ ఎం ఎస్ సిబ్బందితో కలిసి ఈరోజు తెల్లవారుఝామున 4.30 గంటల నుండి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు…
ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 41 మోటార్ సైకిల్లు, 1 కారు,1 ఆటో 10 రాడ్లు,కత్తులు పోలీసులు గుర్తించారు …
నరసరావుపేట రూరల్ పోలీస్టేషన్ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.
పల్నాడు జిల్లా నరసరావు పేట సబ్ డివిజన్ నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నట్లు డిఎస్పీ నాగేశ్వర రావు తెలిపారు.
ఈ
కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నందు డీఎస్పీ నాగేశ్వర రావు , నరసరావు పేట 1వ పట్టణ సి.ఐ ఎం.వి . చరణ్ ,నరసరావు పేట 2వ పట్టణ సి.ఐ హైమారావు ,నరసరావు పేట రూరల్ సి.ఐ పి.రామకృష్ణ ట్రాఫిక్ సిఐ సిహెచ్.లోకనాథం
ఎస్సై లు మరియు ఇతర పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఏ ఎన్ ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.