నారద వర్తమాన సమాచారం
పేకాట స్థావరంపై దాడి – 10మంది వ్యక్తులు అరెస్టు, రూ.10,38,000/- నగదు,11 సెల్ ఫోన్లు మరియు 1బైక్ స్వాధీనం.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అమరావతి గ్రామంలో SRR లాడ్జి నందు 206 నెంబర్ గది నందు పేకాట ఆడుతున్న వారిని తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించిన అమరావతి సి.ఐ Y.అచ్చయ్య
పేకాట ఆడుచున్న 10మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 10,38,000/- నగదు, మరియు 11 సెల్ ఫోన్ లు,1బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగినది.
అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎస్పీ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని
సి.ఐ Y.అచ్చయ్య హెచ్చరించారు.








