నారద వర్తమాన సమాచారం
అక్రమ మైనింగ్ అరికట్టండి
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నకిరేకల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా మండలం నుంచి రీ ఓపెన్ అయిన అర్జీలు, మ్యుటేషన్లు, రీ సర్వే, ఇళ్ల పట్టాల దరఖాస్తుల పరిశీలన, ఇళ్ల నిర్మాణాల రెగ్యులరైజేషన్, గ్రావెల్ అక్రమ తవ్వకాలపై సమీక్ష నిర్వహించారు.
ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్ లో వీఆర్వోలు, సర్వేయర్లు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. సమస్యలు లేని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి ఇళ్ల రెగ్యులరైజేషన్ చేయాలన్నారు.
సదరు కార్యక్రమమును నందు మండలం లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు, రీ సర్వే, హౌస్ సైట్స్, మ్యుటేషన్స్ పై మండల పురోగతి పై సమీక్ష నిర్వహించిన మీదట అధికారులతో మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. గ్రావెల్ తవ్వకాలపై అందుతున్న ఫిర్యాదులకు తక్షణమే స్పందించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రెవెన్యూ, మైనింగ్ అధికారులను ఆదేశించారు.








